Trump Nobel Peace Prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఘర్షణ జరిగినా.. అక్కడ వాలిపోయి పంచాయితీలు చేస్తున్నారు. ఆయనను ఒక శాంతి దూతగా చిత్రీకరించేందుకు వైట్ హౌస్ లోని కార్యవర్గం తెగ ప్రయత్నిస్తుంది. మా అధ్యక్షుడు సగటున నెలకో శాంతి సంధిని కుదురుస్తున్నారంటూ వరుస ప్రకటనలు చేస్తున్నారు. దీంతో అసలు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి వచ్చే అవకాశం ఉందా?.. అతడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దేశాల యుద్ధాలను ఆపాడు, ఎంత మంది ప్రాణాలను రక్షించాడు? అనే దానిపై ట్రంప్ కేబినెట్ జోరుగా ప్రచారం చేస్తుంది.
Read Also: Heavy Rains in Krishna District: కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు.. తెలంగాణకు నిలిచిన రాకపోకలు
ట్రంప్ కేబినెట్ పొగడ్తలు
అయితే, అక్టోబరు మాసంలో నోబెల్ శాంతి బహుమతి 2025 విజేతను ప్రకటించేందుకు నోబెల్ కమిటీ చర్చలు జరుపుతున్న సమయంలో, ట్రంప్ కేబినెట్ ఒక లాబీయింగ్ గ్రూప్‌లా వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కేబినెట్ సభ్యులందరూ ట్రంప్‌ను ప్రశంసలతో ముంచెత్తిన వీడియోలను టెలివిజన్‌లో ప్రసారం చేయిస్తున్నారు. “నోబెల్ బహుమతికి అర్హుడైన అత్యుత్తమ అభ్యర్థి మీరు (ట్రంప్)” అని యూఎస్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే, లేబర్ సెక్రటరీ లోరి ఛావేజ్-డి రేమర్ తన మంత్రిత్వ శాఖలో డొనాల్డ్ ట్రంప్ యొక్క భారీ ఫ్లెక్స్ ఆవిష్కరించి, ఆయనను “అమెరికా కార్మికుల కోసం ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రెసిడెంట్” అని కొనియాడారు. అలాగే, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ కూడా ట్రంప్ ప్రభుత్వంపై విశ్వాసం పునరుద్ధరించారని పేర్కొన్నారు.
నార్వే మంత్రికి ట్రంప్ ఫోన్ కాల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల నార్వే ఫైనాన్స్ మంత్రికి ఫోన్ చేసి నోబెల్ నామినేషన్ గురించి నేరుగా అడిగారని నార్వేజియన్ మీడియా కథనాలు ప్రచురించింది. టారీఫ్ చర్చలతో పాటు నోబెల్ శాంతి బహుమతి విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో ట్రంప్ శాంతి బహుమతికి అర్హుడా అని క్యాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ప్రశ్నించారు. “అమెరికన్ పౌరులపై మరిణ్స్‌ను ప్రయోగించిన ట్రంప్‌కి శాంతి బహుమతి సరిపోతుందా?.. ఆయన దేశానికి శాంతి కాదు, యుద్ధ వాతావరణమే తీసుకువచ్చారని ఆరోపించారు. అలాగే, ట్రంప్ స్థానం నోబెల్ అవార్డు వేదిక కాదు, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అని ఇజ్రాయెల్ జర్నలిస్ట్ గిడియాన్ లేవీ ఎద్దేవా చేశారు.
Read Also: Nivetha Pethuraj : కాబోయే భర్తను పరిచయం చేసిన ‘నివేద పేతురేజ్’.. ‘లక్కీ బాయ్’
నోబెల్ కమిటీ అభిప్రాయం
నార్వే నోబెల్ కమిటీ ఐదుగురిలో ముగ్గురు సభ్యులు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కమిటీ చైర్మన్ జోర్గెన్ ఫ్రైడ్నెస్ మాట్లాడుతూ.. “ట్రంప్ రెండవసారి పదవీకాలంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, మీడియాపై 100కు పైగా మౌఖిక దాడులు చేశారు అని తెలిపారు. ఇక, శాంతి బహుమతి కోసం డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రయత్నాలు చివరికి విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కానీ, నోబెల్ కోసం ట్రంప్ కేబినెట్ చేసిన బహిరంగ లాబీయింగ్ మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.