UAE: నేడు యూఏఈలో రష్యా-అమెరికా-ఉక్రెయిన్ కీలక భేటీ.. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ
- మరోసారి రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు శ్రీకారం
- నేడు యూఏఈలో రష్యా-అమెరికా-ఉక్రెయిన్ కీలక భేటీ
- చర్చలపై సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగబోతున్నాయి. అయితే ఈసారి రష్యా-అమెరికా-ఉక్రెయిన్ త్రైపాక్షిక సమావేశం జరగనుంది. ఇందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక కానుంది. నేటి నుంచి రెండు రోజుల పాటు యూఏఈలో ఈ సమావేశం జరగబోతుందని దావోస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఇలా త్రైపాక్షిక సమావేశం ఇదే తొలిసారి కావడం విశేషం.
జెలెన్‌స్కీ..
ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య మొదటి త్రైపాక్షిక సమావేశం జరుగుతోందని.. ఇది యుద్ధం ముగింపునకు దారితీస్తుందని జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. దావోస్‌లో ట్రంప్‌తో జెలెన్‌స్కీ గంట సేపు సమావేశం అయ్యారు. సమావేశం తర్వాత ట్రంప్‌తో మంచి చర్చలు జరిపినట్లుగా వెల్లడించారు. గురువారం ఉక్రెయిన్ బృందం ట్రంప్‌తో సమావేశమైందని.. అమెరికా బృందం రష్యాకు వెళ్తోందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ చాలా నష్టపోయిందని.. ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి.. శాంతి పరిష్కారానికి దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. శాంతి చర్చలపై గంట సేపు ట్రంప్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు.
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ట్రంప్..
ఇక జెలెన్‌స్కీతో భేటీ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా జరిగాయని.. యుద్ధం ముగియాలని ఆకాంక్షించారు. అమెరికా బృందం పుతిన్‌ను కలవబోతుందని చెప్పారు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు.. ఇక యుద్ధం ముగించాలని స్పష్టం చేశారు. మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా తక్షణమే కాల్పుల విరమణ జరగాల్సి ఉందని తెలిపారు. ఇద్దరు నాయకులు కూడా కాల్పుల విరమణకు ముందుకు రావాలని పుతిన్, జెలెన్‌స్కీకి ట్రంప్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Jharkhand Video: జార్ఖండ్‌లో తప్పిన రైలు ప్రమాదం.. లెవెల్ క్రాసింగ్ దగ్గర ట్రక్కును ఢీకొన్న రైలు
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది. కానీ చర్చలు ఫలించలేదు. అనంతరం నేరుగా ట్రంప్ రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో సమావేశం అయ్యారు. అనంతరం వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీతో సమావేశం అయ్యారు. అయినా కూడా ఫలించలేదు. అటు తర్వాత 28 పాయింట్లు ప్రణాళికను ట్రంప్ తీసుకొచ్చారు. దీనికి పుతిన్ అంగీకారం తెలపగా.. జెలెన్‌స్కీ వ్యతిరేకించారు. ఇది కూడా దారి చూపించలేదు. ఇప్పుడు యూఏఈ వేదిక సమావేశం జరుగుతోంది. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదో చూడాలి.
ఇది కూడా చదవండి: Rahul Sankrityan: ‘ప్రామిస్.. మీ ఆకలి తీరుస్తా’! విజయ్ ఫ్యాన్‌కు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ క్రేజీ రిప్లై..
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!