బ్రిటన్‌లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను సడలిస్తున్నారు. ఈనెల 21 నుంచి ఆంక్షలు సడలింపులు ఉండబోతున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నా, బి 1.617 వెరియంట్ కేసులు బయటపడుతుండటంతో ఆంధోళనలు మొదలయ్యాయి. ఇండియా తరువాత ఈ వేరియంట్ కేసులు బ్రిటన్‌లోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. దీంతో బ్రిటన్‌లో థర్డ్ వేవ్ వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో నమోదవుతున్న కేసుల్లో నాలిగింట మూడొంతులు బి 1.617 వేరియంట్ కేసులు ఉన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంబ్రిడ్జి విశ్వవిధ్యాలనం ప్రొఫెసర్ రవి గుప్తా పేర్కొన్నారు. కేసులు తక్కువగా నమోదవుతున్నా, ఉదృతి పెరిగే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్ గుప్తా పేర్కొన్నారు.