Afghan-Pakistan conflict: ఆఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్ మధ్య ‘‘డ్యూరాండ్ లైన్’’ వివాదం.. 132 ఏళ్లుగా రగులుతున్న సమస్య..
- ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య ‘‘డ్యూరాండ్ లైన్’’ వివాదం.. 132 ఏళ్లగా రగులుతున్న సమస్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghan-Pakistan conflict: ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోంది. గురువారం, కాబూల్ నగరంపై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. శనివారం రాత్రి నుంచి ఆఫ్ఘాన్ తాలిబాన్ దళాలు సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైనిక పోస్టులే లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు తాలిబాన్ అధికారులు చెబుతున్నారు. 25 పాక్ సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తాలిబాన్ దాడులకు పాకిస్తాన్ వణికిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
వివాదానికి కేంద్రంగా ‘‘డ్యూరాండ్ లైన్’’..
Also Read
- POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
అయితే, ఆఫ్ఘాన్-పాకిస్తాన్ మధ్య వివాదం నిన్న మొన్న ప్రారంభమైంది కాదు. ఈ వివాదానికి 132 ఏళ్ల చరిత్ర ఉంది. రెండు దేశాల సరిహద్దు రేఖ ‘‘ డ్యూరాండ్ లైన్’’ సమస్యకు మూలకారణం. సుమారు 2,640 కి.మీ (1,640 మైళ్ళు) విస్తరించి ఉన్న డ్యూరాండ్ రేఖ 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మోర్టిమర్ డ్యూరాండ్ , ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఏర్పడింది. ఈ రేఖ బ్రిటీష్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దును నిర్వచించింది. అయితే, ఈ రేఖ సరిహద్దుల్లో ఉన్న పష్టూన్లు, బలూచ్ తెగలను రెండుగా చీల్చింది.
1893 నాటి డ్యూరాండ్ రేఖను ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం లేదు. తమ పష్టూన్ల తెగకు చెందిన వారు, పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్నారని, ఇది ఆఫ్ఘనిస్తాన్‌కు చెందుతుందని తాలిబాన్లతో సహా, మునుపటి ఆఫ్ఘాన్ పాలకులు వాదిస్తున్నారు. పాకిస్తాన్ దీనిని ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే పాక్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు ప్రజలు తమను తాము పాకిస్తానీయులుగా చెప్పుకోవడం లేదు. ఈ ప్రాంతంలో ‘‘పాక్ తాలిబాన్లు’’ పాక్ ఆర్మీ, పోలీసులపై తీవ్రమైన దాడులు చేస్తున్నారు.
భౌగోళిక, రాజకీయ ప్రాముఖ్యత:
డ్యూరాండ్ రేఖ కేవలం మ్యాప్‌లో ఒక రేఖ మాత్రమే కాదు, ఇది దక్షిణాసియాలోని అత్యంత వివాదాస్పద ప్రాంతాల్లో ఒకటిగా మిగిలింది. పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు తమ సార్వభౌమాధికారం కిందకు వస్తుందని చెబుతోంది. ఇటు ఆఫ్ఘాన్ మాత్రం తమకు జరిగిన అన్యాయమని వాదిస్తోంది. తరుచుగా ఈ సరిహద్దు వెంబడి ఆఫ్ఘాన్-పాక్ సైనిక దళాలు కాల్పులకు తెగబడుతుంటాయి. అరేబియా సముద్రంలోకి ప్రవేశం కల్పించే బలూచిస్తాన్‌తో పాటు పష్టూన్ భూభాగాలనున తిరిగి ఇవ్వాలని ఆఫ్ఘాన్ కోరుతోంది. 2017లో సరిహద్దు వద్ద పాకిస్తాన్ కంచె నిర్మించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
తాజావార్తలు
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!