చైనా మరోసారి తన విస్తరణవాదానికి తెర లేపింది. తైవాన్ గగనతలంలోకి యుద్ధ విమానాలు పంపి ఉద్రిక్తత వాతావరణం సృష్టించడానికి చూస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి చైనా తైవాన్‌ను రెచ్చగొడుతుంది. ఇదే వారంలో రెండు సార్లు చైనా, తైవాన్ ఎయిర్ ఢిపెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌లోకి విమానాలను పంపింది చైనా. తాజాగా 13 విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపి చైనా వక్రబుద్ధిని మరోసారి నిరూపించుకుంది.వీటిలో కంట్రోల్ (AEW&C) విమానం,ఆరు షెన్యాంగ్ J-16 మరియు రెండు చెంగ్డు J-10 ఫైటర్ జెట్‌లు…
చైనాకు జీవిత కాల అధినాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను నియమిం చేందుకు వీలుగా అధికార కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) గురువారం ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది జిన్‌పింగ్ మూడోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీపీసీ 100 ఏళ్ల చరిత్రలో ఇది మూడో చారిత్రాత్మక తీర్మానం కావడం విశేషం. చైనా కమ్యూనిస్టు పార్టీ ఫ్లీనరీ సమావేశాలు నవంబర్ 8 నుంచి ప్రారంభమ య్యాయి. నాలుగు రోజులు జరిగిన ఈ సమావేశంలో 400 మంది కేంద్ర కమిటీ సభ్యులు…
చైనా చేస్తున్న ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిపై ఉక్కు పాదం మోపుతుం ది. కరోనా వచ్చిన కొత్తలో వుహాన్ నగరంలోని పరిస్థితులను ప్రశ్నిం చిన జర్నలిస్ట్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆమె చావు బతుకుల్లో కొట్టు మిట్టాడుతున్నారు. చైనాకు చెందిన ఝాంగ్ జాన్(38) ఓ జర్నలిస్ట్ అంతక ముందు ఆమె న్యాయవాదిగా పని చేశారు. 2020లో వుహాన్ నగరంలోని వాస్తవ పరిస్థితులను ప్రపంచా నికి తెలియజేసినందుకు, వార్తలు…