చైనాకు జీవిత కాల అధినాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను నియమిం చేందుకు వీలుగా అధికార కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) గురువారం ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది జిన్‌పింగ్ మూడోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీపీసీ 100 ఏళ్ల చరిత్రలో ఇది మూడో చారిత్రాత్మక తీర్మానం కావడం విశేషం. చైనా కమ్యూనిస్టు పార్టీ ఫ్లీనరీ సమావేశాలు నవంబర్ 8 నుంచి ప్రారంభమ య్యాయి. నాలుగు రోజులు జరిగిన ఈ సమావేశంలో 400 మంది కేంద్ర కమిటీ సభ్యులు…