ఐసీసీ అవార్డులను కొల్లగొట్టిన పాక్ క్రికెటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది సీజన్లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురస్కారాలు ప్రకటించింది. 2021 సీజన్ కోసం ప్రకటించిన ఈ వార్షిక అవార్డుల్లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా స్పష్టమైంది. ఏకంగా నాలుగు అవార్డులను కొల్లగొట్టారు. 2021లో అత్యుత్తమ టీ20 ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఎంపిక కాగా, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కెప్టెన్ బాబర్ అజామ్ నిలిచాడు. బాబర్ గతేడాది 6 వన్డేల్లో 67.50 సగటుతో 405 పరుగులు సాధించాడు. వాటిలో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది ఎంపికయ్యాడు. అఫ్రిది గతేడాది అన్ని ఫార్మాట్లలో 36 మ్యాచ్ లు ఆడి 78 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ వర్ధమాన మహిళా క్రికెటర్ అవార్డును పాకిస్థాన్‌కు చెందిన ఫాతిమా సనా చేజిక్కించుకుంది. 20 ఏళ్ల ఫాతిమా సనా పేస్ బౌలర్. 16 మ్యాచ్ లలో 24 వికెట్లు తీసి సత్తా చాటింది. గతేడాది కాలంగా పాకిస్థాన్ టీ20, వన్డే జట్లలో కీలక సభ్యురాలుగా మారింది. 2021 సీజన్‌కు గాను అత్యుత్తమ టెస్టు ప్లేయర్ గా ఇంగ్లండ్ సారథి జో రూట్ ఎంపికయ్యాడు. రూట్ 15 మ్యాచ్ ల్లో 1,708 పరుగులు నమోదు చేశాడు. అందులో 6 సెంచరీలు ఉన్నాయి. కాగా ఈ సారి ఐసీసీ అవార్డుల్లో పాక్ క్రికెటర్లూ సత్తా చాటారు.

ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా స్మృతి మంధన
భారత్ కు చెందిన డాషింగ్ మహిళా క్రికెటర్ స్మృతి మంధనను ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం వరించింది. ఎడమచేతివాటం మంధన గత సీజన్ లో 22 మ్యాచ్ లు ఆడి ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీల సాయంతో 855 పరుగులు చేసింది. స్మృతి మంధన 2018లోనూ ఈ పురస్కారం అందుకుంది.
Also Read
- Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
- Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
తాజావార్తలు
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
-
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్‌గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని.!
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!