పాకిస్తాన్ వాణిజ్య నగరంలో కరాచీలో భారీ ఉగ్రదాడి జరిగింది. కరాచీలోని పోలీస్ కార్యాలయమే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. కరాచీలోని షరియా ఫైసల్ ప్రాంతంలో ఉన్న పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం. కనీసం 8-10 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం కార్యాలయంలో ఉన్నట్లు పాకిస్తాన్ జియో న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ రేంజర్లు, పోలీసులు చుట్టుముట్టారు. ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.