Site icon NTV Telugu

Gaza-Israel: గాజాలో మళ్లీ టెన్షన్ వాతావరణం.. తాజా దాడుల్లో 26 మంది మృతి

Gazaisrael

Gazaisrael

గాజాలో మళ్లీ బాంబుల మోత మోగుతోంది. ఒక వారం పాటు ప్రశాంతంగా ఉన్న గాజాలో మళ్లీ బాంబులు మోతతో దద్దరిల్లింది. ఇటీవల ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. హమాస్ ఉగ్రవాదులు.. బందీలను విడిచిపెట్టారు. అలాగే పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ప్రస్తుతం అంతా కూల్‌గా ఉందనుకున్న సమయంలో మరోసారి ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి.

ఇది కూడా చదవండి: PAK vs AFG: కాల్పుల విరమణకు ఒప్పుకున్న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌..

శాంతి ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 26 మంది చనిపోయారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. నుసెయిరాట్ ప్రాంతంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై జరిగిన దాడిలో చనిపోయినట్లు వెల్లడించారు. మృతుల్లో ఒక మహిళ, బిడ్డ ఉన్నట్లు పేర్కొన్నారు.

హమాస్ ఉగ్రవాదులు.. తమ దళాలపై విధ్వంసక క్షిపణిని ప్రయోగించారని ఇజ్రాయెల్ ఆరోపించింది. తమ దళాలపై జరిపిన దాడుల తర్వాత ఎన్‌క్లేవ్ అంతటా హమాస్ లక్ష్యాలను, ఫీల్డ్ కమాండర్లు, గన్‌మెన్‌లు, ఒక సొరంగం, ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.

ఇది కూడా చదవండి: Off The Record: సొంత మైలేజ్ కోసం ఎమ్మెల్యేలను నాగబాబు దూరం పెడుతున్నారా ?

ప్రస్తుతం గాజా-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉందని ట్రంప్ తెలిపారు. ఏం జరిగిందో అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారని.. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగేలా చూస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ జరిపిన దాడులు సమర్థనీయమో కాదో తనకు తెలియదన్నారు.

అమెరికా ఒత్తిడి మేరకు గాజాకు సహాయం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని ఇజ్రాయెల్ భద్రతా వర్గాలు తెలిపాయి. కానీ ఇంతలోనే దాడులు మళ్లీ షురూ అయ్యాయి. అయితే హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని బహిరంగంగా ఉల్లంఘించినందుకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ సరఫరాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ కొద్దిసేపటికే ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 26 మంది చనిపోయారు.

రెండేళ్ల తర్వాత అక్టోబర్ 10న ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. ఇరు పక్షాలు కూడా శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. హమాస్ ఉగ్రవాదులు బందీలను విడుదల చేయగా.. ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. కానీ కొద్దిరోజులకే మళ్లీ పరిస్థితులు మొదటికొచ్చాయి.

Exit mobile version