మనం ఏదైనా సాధించాలంటే.. దానికోసమే శ్రమించాలి.. దానిలో భాగంగా ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. వాటిని పట్టించుకోకూడదు. ఎందుకంటే కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవడంలో తప్పు లేదు. ఇదే విషయాన్ని తన జీవితంలో చేసి చూపించింది రొమేనియాకు చెందిన సిమోనా హెలెప్. ఈమెకు చిన్నప్పటినుంచి టెన్నిస్ ప్లేయర్ కావాలని కోరిక.. అందుకోసం ఎంతో శ్రమించింది. అనుకునంట్లుగానే అన్ని పోటీలలో తానే గెలిచింది. కానీ, కీలక మ్యాచుల్లో మాత్రం ఆమెకు ఓటమి తప్పలేదు. అయితే ఆ ఓటమికి కారణం తన బ్రెస్ట్ సైజ్ అని అర్ధం చేసుకుంది. 17 ఏళ్లకే భారీ బ్రెస్ట్ ఉండడంతో గేమ్ సరిగా ఆడలేకపోయింది. భారీగా ఉన్న బ్రెస్ట్ కారణంగా యాక్టివ్ గా ఆడలేకపోతున్నాను అని గ్రహించిన ఆమె తన 34DDగా ఉన్న బ్రెస్ట్ ని 34Cకి తగ్గించుకున్నది.
సర్జరీ తరువాత సిమోనా హెలెప్ లో చాలా మార్పు వచ్చింది. అంతకు ముందు కన్నా ఎక్కువగా ఆటలో చురుకుగా పాల్గొంది. ఈ సర్జరీ తరువాత ఆమె పలు టోర్నీలలో రాణించింది. సెమీస్ వరకు కూడా రాలేని ఆమె సర్జరీ తరువాత ఫైనల్ కి చేరుకోవడం, కప్ గెలవడం గమనార్హం. అమ్మాయిలందరూ బ్రెస్ట్ పెద్దదిగా ఉండాలని కోరుకుంటారు.. కానీ, మీరు ఉన్నదాన్ని తగ్గించుకున్నారు .. బాధగా లేదా అని సిమోనా ను అడిగితే.. నాకు చిన్నప్పటినుంచి టెన్నిస్ ప్లేయర్ గా రాణించాలని కోరిక.. దానికోసం నేను ఏదైనా చేస్తా.. అది కావాలన్నప్పుడు ఇవన్నీ నాకు అవసరం లేదని అనిపించింది, అందుకే ఇలా చేశాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది.