Taliban: పాకిస్తాన్‌కు వచ్చే కొన్నేళ్లలో తాగడానికి, వ్యవసాయానికి నీరు కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘సింధూ జల ఒప్పందం’’ను నిలిపేసింది. పాకిస్తాన్‌కు ముఖ్యంగా, పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో సింధూ, దాని ఉప నదులే ప్రజల జీవితాలకు ఆధారం. ఇప్పుడు, భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నడుస్తున్నారు. ఆఫ్ఘాన్ నుంచి పాక్‌లోకి వెళ్లే నదుల నీటిని సరిహద్దు దాటనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: Kadiyam Srihari: కాంగ్రెస్‌లో చేరలేదు.. ఆ ప్రచారం అబద్ధం
ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం కునార్ నది నుంచి నీటిని దేశంలోని నంగర్హార్ ప్రాంతానికి మళ్లించే ప్రణాళికను ముందుకు తెచ్చింది. ఇప్పటికే, ఆఫ్ఘాన్-పాక్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ ప్రణాళిక ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తత పెంచే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ప్రధానమంత్రి కార్యాలయ ఆర్థిక కమిషన్ సాంకేతిక కమిటీ సమావేశంలో, కునార్ నది నుండి నంగర్హార్లోని దారుంటా డ్యామ్‌కు నీటిని బదిలీ చేసే ప్రతిపాదన చర్చల తర్వాత ఆమోదించబడిందని, తుది నిర్ణయం కోసం ఆర్థిక కమిషన్‌కు పంపబడిందని చెప్పింది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే నంగర్హార్ లోని అనేక వ్యవసాయ భూములకు నీటి కొరతను పరిష్కరించవచ్చు. ఒక వేళ ఈ ప్రాజెక్టు పూర్తిగా కార్యరూపంలోకి వస్తే, పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా నీటి కొరను ఎదుర్కోవాల్సిందే.
సుమారు 500 కిలోమీటర్ల పొడవున ప్రవహించే కునార్ నది, పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్ జిల్లాలోని హిందూ కుష్ పర్వతాలలో ఉద్భవిస్తుంది. ఆ తర్వాత దక్షిణంగా ప్రవహించి ఆఫ్ఘనిస్తాన్ లోకి వస్తుంది. కునార్, నంగర్హార్ ప్రావిన్సల గుండా ప్రవహించి, కాబూలో నదిలో కలుస్తుంది. ఆ తర్వాత మళ్లీ పాకిస్తాన్లోకి ప్రవేశించిస్తుంది. పాక్‌లోని అటాక్ ప్రాంతంలో సింధు నదిలో కలుస్తుంది. ఇది పాకిస్తాన్లో ప్రవహించే అతిపెద్ద నదుల్లో ఒకటి. ఆఫ్ఘాన్ కునార్ నదిపై ఆనకట్టలు నిర్మిస్తే పాక్ దెబ్బతినడం ఖాయం.