Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- సౌదీ–హూథీ ఘర్షణపై పాకిస్థాన్ మతపెద్ద తాహిర్ అష్రఫీ వ్యాఖ్యలు
- హూథీలను “టెర్రరిస్టులు”గా అభివర్ణించిన అష్రఫీ
- “ఇస్లాంతో వారికి సంబంధం లేదు” అన్న పాక్ ఉలేమా కౌన్సిల్ చైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Houthi vs Saudi: సౌదీ అరేబియా- హౌతీల మధ్య ఘర్షణ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెంచుతోంది. అయితే, ఈ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ మత గురువు, ఉలేమా కౌన్సిల్ చైర్మన్ హఫీజ్ తాహిర్ అష్రఫీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ సంస్థను టెర్రిరస్టులని, ఇస్లాంతో వారికి సంబంధం లేదని పేర్కొన్నారు. సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా నిలిచే వారిని ఎదుర్కోవడంతో ముస్లింలు, ముఖ్యంగా పాకిస్తాన్ సౌదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మదీనాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో అష్రఫీ ఈ వ్యాఖ్యలు చేశారు.
హౌతీలు ఇస్లాంకు సంబంధం లేని టెర్రరిస్టులు అని, సౌదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న శత్రువులకు వారు మద్దతుగా ఉన్నారని ఆరోపించారు. మక్కా, మదీనాలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండదించారు. యెమెన్ ప్రజలకు సౌదీ భారీగా సాయం చేసినప్పటికీ హౌతీలు దానిని తిరస్కరించారని ఆరోపించారు. సౌదీకి పాకిస్తాన్ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వంతో పాటు పాక్ సైన్యం, మతపెద్దలు, ప్రజలు వారికి మద్దతుగా ఉంటారని అన్నారు.
Also Read
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల హౌతీల దాడులు సౌదీపై తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్-సౌదీ అరేబియా-టర్కీల ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ విఫలమైంది. ఈ దేశాలు సౌదీకి కేవలం మాటలతో మాత్రమే అండగా నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ మతపెద్ద అష్రఫీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!