Sun: జూన్ నెలలో సూర్యుడిపై అత్యధిక సంఖ్యలో సన్‌స్పాట్స్ ఏర్పడ్డాయి. రెండు ధశాబ్ధాల కాలంలో ఇలా అత్యధిక సంఖ్యలో సన్‌స్పాట్స్ ఏర్పడటం ఇదే తొలిసారి. గత నెలలో 160కి పైగా సన్‌స్పాట్‌లను ఏర్పడినట్లు Space.com నివేదించింది. ఇది నాసా అంచనా వేసిన దాని కంటే ఎక్కువ. ప్రస్తుతం సూర్యుడు తన 25వ సౌరచక్రంలో ఉన్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలం గందరగోళంగా తయారవుతోంది. ప్రతీ 11 ఏళ్లకు సూర్యుడి ఉత్తర,దక్షిణ ధృవాలు తారుమారు అవుతుంటాయి. దీంతో మాగ్నిటిక్ ఫీల్డ్ లో తీవ్ర సమతుల్యత ఏర్పడుతుంది. దీని కారణంగా సూర్యుడిపై సన్ స్పాట్స్ ఏర్పడుతుంటాయి.
Read Also: NCP Crisis: పవార్ వర్సెస్ పవార్.. పోటాపోటీగా విప్ జారీ చేసిన రెండు వర్గాలు..
నాసా ప్రకారం.. ఈ సోలార్ సైకిల్ లో సూర్యుడిపై 125 వరకు సన్ స్పాట్స్ ఏర్పడుతాయిని అంచానా వేసింది. అందుకు విరుద్ధంగా ఈ సంఖ్య జూన్ నెలలో ఎక్కువగా ఉంది. 2002తో పోలిస్తే 2023 జూన్ నెలలో 163 సన్ స్పాట్స్ ఏర్పడ్డాయి. Spaceweather.com ప్రకారం.. జూలై 2న సూర్యుడి ఉపరితలంపై ఉన్న ఒక సన్ స్పాట్ నుంచి సౌర మంటలు ఎగిసిపడ్డాయి. సాధారణంగా ఈ సన్ స్పాట్స్ సూర్యుడిపై మచ్చగా ఉంటాయి. సూర్యుడితో ఇతర ప్రాంతాలలో పోలిస్తే తక్కువ ఉష్ణోగ్రత ఉండటంతో ఇవి మచ్చలా కనిపిస్తుంటాయి. అయితే ఈ సన్ స్పాట్స్ వద్ద మ్యాగ్నిటిక్ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. భూమితో పోలిస్తే 2500 రెట్లు ఎక్కువ పవర్ పుల్ అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సోలార్ సైకిల్ 2025, 2026 వరకు గరిష్టానికి చేరుతుందని శాస్త్రవేత్తలు
ఈ సన్ స్పాట్స్ తరుచుగా సౌర తుఫానులకు, భారీ విస్పోటనాలకు కారణం అవుతుంటాయి. వీటి నుంచి సౌర జ్వాలలు ఎగిసిపడి విశ్వంలోకి ప్రయాణిస్తుంటాయి. ఈ సౌర తుఫానులు భూమిని తాకుతాయి. ఇందులో ఉండే ఆవేశిత కణాలు భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. అయితే భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం వీటని అడ్డుకుని భూమిని పై ఉన్న జీవాలను రక్షిస్తోంది. ఈ సౌరతుఫానుల వల్ల ధృవాల వద్ద ఆరోరాలు ఏర్పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో సౌరతుఫానులు కమ్యూనికేషన్ శాటిలైట్స్, విద్యుత్ గ్రిడ్లపై ప్రభావం చూపిస్తాయి.