Earth Core: భూమి అంతర్గత కోర్ భ్రమణవేగం తగ్గిందని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC) శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. గతంలో పోలిస్తే భూమి అంతర్గత కోర్ ఉపరితలం కన్నా నెమ్మదిగా తిరుగుతున్నట్లు నిర్ధారించారు. ఈ పరిణామాలు భూమిపై, ముఖ్యంగా భూమి అయస్కాంత క్షేత్ర స్థిరత్వం, రోజుల వ్యవధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపించొచ్చని సైన్స్ అలర్ట్ నివేదించింది. 2010 నాటికి లోపలి కోర్ దాని వేగాన్ని తగ్గించడం ప్రారంభించిందని, ఇది భూమి మాంటిల్ కన్నా నెమ్మదిగా కదులుతున్నట్లు సుమారు 40 ఏళ్లలో తొలిసారిగా గుర్తించబడింది. భూమి లోపలి కోర్ ఇనుము, నికెల్‌లో కూడిన గోళం. ఇది భూ ఉపరితలం నుంచి 4800 కి.మీ లోతులో ఉంది. ఈ అంతర్గత కోర్, ద్రవంగా ఉండే బాహ్య కోర్(కరిగిన లోహాలతో తయారైన ద్రవం)లోపల ఉంటుంది. ఈ అంతర్గత, బాహ్య కోర్‌లు కలిసి భూమికి సంబంధించిన మూడు పొరలలో ఒకదానిని ఏర్పరుస్తాయి. మిగిలిన రెండు మాంటిల్, క్రస్ట్.
Read Also: Hyderabad: హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం..రూ.100 కోట్లు లూటీ
అయితే, భౌతికంగా కోర్ వేగాన్ని మనం గుర్తించలేము. కానీ భూంకపాలు పంపిన తరంగాలను రికార్డింగ్ చేసి సిస్మోగ్రామ్ ద్వారా విశ్లేషిచడం ద్వారా తెలుసుకోవచ్చు. అంతర్గత కోర్ బాహ్య కోర్‌లో ఉత్పన్నమయ్యే అయస్కాంత క్షేత్రం, భూమి మాంటిల్ లోని గురుత్వాకర్షణ ప్రభావాల ద్వారా ప్రభావితమవుతుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జియోఫిజిసిస్ట్ డంకన్ అగ్న్యూ ప్రకారం.. భూమి లిక్విడ్ కోర్ దాని భ్రమణాన్ని మందగిస్తు్న్నట్లు చెప్పారు. ఈ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భూమి వేగం పెరుగుతుందని అగ్న్యూ తెలిపారు.
తాజా అధ్యయనంలో పరిశోధకులు 1991 మరియు 2023 మధ్య దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని మారుమూల ద్వీపసమూహంలో దక్షిణ శాండ్‌విచ్ దీవులలో 121 పునరావృత భూకంపాలు సంభవించిన ప్రాంతాల డేటాను విశ్లేషించారు. ఇన్నర్ కోర్ చాలా దశాబ్ధాల్లో మొదటిసారిగా భ్రమణ వేగం మందగించింది. ద్రవ బాహ్య కోర్, మాంటిల్ ఉత్పత్తి చేసే గురుత్వాకర్షణ లాగడం వల్ల లోపలి కోర్ భ్రమణ వేగం మందగించిందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇది చివరకు గ్రహ భ్రమణాన్ని మార్చగలదని చెప్పారు.