Strait Of Hormuz: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త..
- ప్రపంచానికి ఇరాన్ శుభవార్త..
- హార్ముజ్ తెరుస్తున్నట్లు ప్రకటన..
- ఇజ్రాయిల్-లెబనాన్ సీజ్ ఫైర్ నేపథ్యంలో నిర్ణయం..
Strait Of Hormuz: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. ఇజ్రాయిల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో, చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని తిరిగి తెరస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ కాలం ఉన్నంత కాలం జలసంధిని ఓపెన్ చేసి ఉంచుతున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ ఎక్స్‌లో ప్రకటించారు. ఈ జలమార్గం ద్వారా అన్ని వాణిజ్య నౌకలు రాకపోకలు కొనసాగించొచ్చని అన్నారు.
‘‘లెబనాన్‌లో అమలవుతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా, ఆ విరమణ కాలం మిగిలి ఉన్నంత వరకు హార్ముజ్ జలసంధి గుండా అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు మార్గం పూర్తిగా తెరిచి ఉంటుంది’’ అని అరఘ్చీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని 20 శాతం చమురు సరఫరా ఈ ఇరుకైన జలమార్గం గుండానే సాగుతుంది. యుద్ధం కారణంగా ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా మూసేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఏర్పడింది. భారత్ సహా యూరప్, చైనా ఇతర దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. 49 రోజుల తర్వాత ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచింది.
In line with the ceasefire in Lebanon, the passage for all commercial vessels through Strait of Hormuz is declared completely open for the remaining period of ceasefire, on the coordinated route as already announced by Ports and Maritime Organisation of the Islamic Rep. of Iran.
— Seyed Abbas Araghchi (@araghchi) April 17, 2026
తాజావార్తలు
-
Strait Of Hormuz: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త..
-
Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
-
Rain Alert : రాబోయే 2 గంట్లలో తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్
-
Suspended: పల్లెటూర్లో ఇలా ఎలా చేయాలనిపించింది రా..? పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్..
-
Kangana Ranaut: ‘రాహుల్ గాంధీ మాట వింటే తలనొప్పి వస్తోంది’.. షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్
ట్రెండింగ్
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!