Kangana Ranaut: ‘రాహుల్ గాంధీ మాట వింటే తలనొప్పి వస్తోంది’.. షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల రెండో రోజు కూడా మహిళా రిజర్వేషన్ల బిల్లుపై వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ గౌరవాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
Also Read
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
చిన్ననాటి కథలు చెబుతున్నారు..
ఈ సందర్భంగా కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రసంగంపై విరుచుకుపడ్డారు. “రాహుల్ గాంధీ మాటలు వినడం తలనొప్పిగా అనిపిస్తోంది. ఆయన పార్లమెంట్‌లో తన చిన్ననాటి కథలు, ఇంద్రజాల ప్రదర్శనల గురించి చెబుతున్నారు. ఎవరో మాంత్రికుడు తనను గొలుసులతో బంధించాడని, రాత్రిపూట వణుకు వచ్చేదని అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. స్పీకర్ ఆపమని చెప్పినా వినకుండా, ‘మీరు ఆస్వాదించాలి’ అంటూ అనవసర ప్రసంగాలు చేస్తున్నారు. ఆయన పార్లమెంట్ భవనాన్ని ఒక అపహాస్యంగా మార్చేశారు” అని కంగనా విమర్శించారు.
అంతకుముందు సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. “ఇది మహిళా సాధికారత కోసం తెచ్చిన బిల్లు కాదు. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వ్యతిరేకమైనది. వారి హక్కులను హరించడమే ప్రభుత్వ లక్ష్యం. అస్సాం, జమ్మూ కాశ్మీర్‌లో చేసినట్లుగానే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది” అని ఆరోపించారు. ఈ చట్టం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని, ఓబీసీల హక్కులను కాపాడటమే తన ప్రాధాన్యతని రాహుల్ పేర్కొన్నారు. “ప్రభుత్వం అధికారం కోసం ఇలాంటి సిగ్గుచేటైన చట్టాలను తీసుకువస్తోంది. పాత చట్టాన్ని పునరుద్ధరిస్తేనే తమ మద్దతు ఉంటుంది తప్ప, ఈ కొత్త బిల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై ఉభయ సభల్లోనూ గందరగోళం కొనసాగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!