Covid Booster: మన దేశంలో ఎక్కువ శాతం మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాలని నిపుణులు సూచించినా ప్రజల్లో అంతగా ఆసక్తి కనిపించలేదు. దీనికి కారణం కరోనా యొక్క మూడవ వేవ్ యొక్క తీవ్రత చాలా వరకు తగ్గింది. మరణాల రేటు కూడా చాలా తక్కువ. దీంతో బూస్టర్ డోస్ కోసం ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు చైనాతో సహా అనేక దేశాల్లో, కరోనా BF7 వేరియంట్ ఎక్కువగా వ్యాపించడమే కాకుండా.. మరణాల రేటు ఎక్కువగా ఉండటంతో.. ప్రపంచంలోని అనేక దేశాలలో అప్రమత్తమయ్యాయి. దీంతో అలర్ట్ అయి బూస్టర్ డోస్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసికా వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్ కింద వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. కాబట్టి రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోస్ తీసుకోవడానికి కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోవాలి.
Read also: PVN Madhav: జనసేనతో తప్ప మరో పార్టీతో పొత్తు ఉండదు.. త్వరలోనే ఉమ్మడి పోరాటాలు..!
మొదటి రెండు మోతాదులతో వచ్చే రోగనిరోధక శక్తి కాలక్రమేణా తగ్గిపోతుంది. బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా ఇది మళ్లీ బలపడుతుంది. వైరస్‌తో పోరాడడంలో బూస్టర్ డోస్ మన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. కోవిన్ పోర్టల్‌లో బూస్టర్ డోస్ కోసం నమోదు చేసుకోవచ్చు. మునుపటి రెండు డోస్‌లలో ఇచ్చిన మొబైల్ నంబర్ ఆధారంగా మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత బూస్టర్ డోస్‌కు అర్హత ఉందో లేదో చూపుతుంది. కరోనా యొక్క రెండవ డోస్ తీసుకున్న 9 నెలల తర్వాత వారు బూస్టర్ డోస్‌కు అర్హులు. మీకు అర్హత ఉంటే షెడ్యూల్ ఎంపికపై క్లిక్ చేయండి. పిన్ కోడ్‌ను నమోదు చేస్తే సమీపంలోని టీకా కేంద్రాల వివరాలు కనిపిస్తాయి. వాటిలో ఒకదాన్ని ఎంచుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో నాసల్ వ్యాక్సినేషన్ వేస్తున్నారు. కాబట్టి మీరు దీనికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ రంగంలో ఉచితంగా బూస్టర్ డోస్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jogu ramanna : బండి సంజయ్ పై జోగు రామన్న ఫైర్.. ఏం చేశారో చెప్పండని సవాల్..