Petrol Price Hike: మరోసారి పెట్రోల్ ధరల పెంపు.. అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త ధరలు!
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- మరోసారి పెట్రోల్ ధరల పెంపు
- అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వివిధ దేశాలు ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇంకా తగ్గని శ్రీలంకలో ఇంధన ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండోసారి ధరలను పెంచడం అక్కడి ప్రజలకు మరింత భారంగా మారింది. శ్రీలంక ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు గణనీయంగా పెరగడంతో రవాణా ఖర్చులు కూడా పెరగనున్నాయి. దీంతో రోజువారీ జీవన వ్యయం మరింత భారమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా పెంపుతో ఆక్టేన్ 92 పెట్రోల్ ధర లీటర్‌కు రూ.81 పెరిగి.. రూ.398కు చేరింది. అలాగే ఆక్టేన్ 95 పెట్రోల్ ధర రూ.90 పెరిగి.. లీటర్‌కు రూ.455గా నమోదైంది. డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆటో డీజిల్ లీటర్‌కు రూ.79 పెరిగి రూ.382కు చేరగా.. సూపర్ డీజిల్ రూ.90 పెరిగి లీటర్‌కు రూ.443గా మారింది. కిరోసిన్ ధర కూడా రూ.60 పెరిగి లీటర్‌కు రూ.255కు చేరింది. ఇంధన ధరల ఈ వరుస పెంపులతో శ్రీలంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజలకు ఇది మరింత భారంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?