ఈ వ్యాక్సిన్.. డెల్టా వేరియంట్‌పై 83 శాతం సమర్థంగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి రోజుకో కొత్త వైరస్‌లో వివిధ వేరియంట్లలో భయపెడుతూనే ఉంది.. ప్రస్తుతం అమెరికా, చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది డెల్టా వేరియంట్.. అయితే, కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి తయారు చేసిన వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతాయనే దానిపై పలు వాదనలు ఉన్నాయి.. కొన్ని అధ్యయనాల్లో.. అవి ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి అనేది కూడా తేల్చాయి.. తాజాగా.. రష్యా తయారు చేసిన పై స్పుత్నిక్ వి.. కరోనా డెల్టా వేరియంట్‌పై ఎంత వరకు పనిచేస్తుందనేదానిపై పరిశోధనలు జరిగాయి.. ఈ వ్యాక్సిన్ 83 శాతం సమర్థంగా డెల్టా వేరియంట్‌పై పనిచేస్తున్నట్టు వెల్లడించారు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురష్కో.
మరోవైపు.. కరోనాలోని అన్ని వేరియంట్లపై కూడా తమ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందంటున్నారు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీదారులు. తీవ్రమైన కోవిడ్ నుంచి ఈ వ్యాక్సిన్ 95 శాతం రక్షణ కల్పిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.. కరోనా రాకుండా, డెల్టా వేరియంట్‌ను అడ్డుకోవడంలో స్పుత్నిక్ వి సమర్థంగా పని చేస్తోందని ప్రకటించారు.. మొత్తంగా తాజా ఫలితాలు డెల్టా వేరియంట్‌పై 83 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని తేల్చాయి. కాగా, ప్రపంచంలో కరోనా వైరస్ పై పోరాటంలో తొలి వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ వి గుర్తింపు పొందింది.. రష్యాలో తయారైన ఈ వ్యాక్సిన్‌ను భారత్ సహా దాదాపు 50 దేశాల వరకు దిగుమతి చేసుకుంటున్నాయి.
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!