చెట్లకేమైనా డబ్బులు కాస్తున్నాయా.. అని పెద్దలు చాలాసార్లు తిట్టడం వినే ఉంటాం. అయినా.. అంటే అన్నారంటారు కానీ చెట్లకు పూలు, కాయలు తప్ప ఏం కాస్తాయి అని అనుకుంటాం కదా.. అయితే ఇక్కడ మనం చెప్పుకొనే చెట్లు డబ్బు కాదు ఏకంగా బంగారాన్నే కాస్తున్నాయట.. ఏంటీ .. నిజమా అని నోర్లు వెళ్లబెట్టక్కర్లేదు.. నిజమే .. అక్కడ చెట్లకు బంగారం కాస్తోంది.. దాన్ని అమ్ముకునే చాలామంది వ్యాపారులు డబ్బు సంపాదిస్తున్నారంట. మరి ఆ ప్లేస్ ఎక్కడో చూద్దాం
పెయిన్‌లోని టియర్రా డి పినారెస్, సియర్రా డి గ్రెడోస్ పర్వతాల మధ్య ఫైన్ చెట్లతో నిండిన దట్టమైన అడవి ఉంది.. అక్కడ చాలామందికి ఫైన్ చెట్ల నుంచి వచ్చే జిగురే ఆదాయ వనరు. దాన్ని అమ్మే వారు జీవనం సాగిస్తున్నారు. పైన్ చెట్ల నుంచి వచ్చే జిగురును అప్పట్లో.. నౌకలకు వాటర్ ప్రూఫ్‌గా, గాయాలకు మందుగా వాడడంతో పాటూ కాగడాలు వెలిగించేవారని చరిత్ర చెప్తోంది. ఇక రాను రాను ఆ చెట్ల జిగురును ఎవరు ఉపయోగించకపోవడంతో ఆ చెట్లను నరికేశారు. కానీ, 19 వ శతాబ్దంలోని కొందరు మళ్లీ ఈ జిగురు వ్యాపారం ప్రారంభించారు. అంతకు ముందులా జిగురు ఎక్కువగా రాకపోవడంతో చెట్లకు గాట్లు పెట్టి, వాటికి కుండలను కట్టి జిగురును తీస్తున్నారు.. తీసిన జిగురును ఫ్యాక్టరీలకు పంపి డిస్టిలేషన్ ప్రక్రియ చేస్తున్నారు. అనంతరం దాని నుంచి టర్పెంటైన్‌ను వేరు చేస్తున్నారు. ఆలా వేరు చేయడంతో ఆ జిగురు బంగారు వర్ణంలోకి మారుతోంది. ఆ జిగురు కాస్తా పసుపు వర్ణంలో రాయిగా మారిన తర్వాత బంగారంగా మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముకుంటన్నారు. ప్రస్తుతం ఈ వ్యాపారం అక్కడ చాలా ఫేమస్ గా మారింది. ఈ లెక్కన చెప్పుకుంటే నిజంగానే ఆ చెట్లు బంగారాన్నే కాస్తున్నాయన్నమాట.