ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇరు పక్షాలు పరస్పరం వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ క్షిపణి ఇజ్రాయెల్‌లోని ప్రధాన ఆస్పత్రిని ఢీకొట్టింది. దీంతో ఆస్పత్రిలోని కొంత భాగం ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Nara Lokesh: ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించండి.. కేంద్రమంత్రికి లోకేశ్ విజ్ఞప్తి!
క్షిపణి దాడికి గురైన ఆస్పత్రిని ముందే ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా బుధవారం రోగులను ఖాళీ చేయించినట్లు మాగెన్ డేవిడ్ అడోమ్ అధిపతి ఎలి బిన్ తెలిపారు. దీంతో చాలా మంది ప్రాణాలతో బయటపడినట్లుగా పేర్కొంది. ఇక ఆస్పత్రిపై క్షిపణి దాడి యుద్ధ నేరమని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రి ఉరియల్ బుసో అన్నారు. టెహ్రాన్ ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఇరానీ క్షిపణులు ఇజ్రాయెల్‌లోని చాలా నగరాలను తాకాయని.. దీంతో పలుచోట్ల నష్టంతో పాటు పలువురికి గాయాలు అయినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Rajnikanth : జైలర్ 2 లో బాలీవుడ్ కింగ్ ఖాన్.?
ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లొంగిపోవాలని ట్రంప్ సూచించారు. దీనికి ఖమేనీ ప్రతి స్పందిస్తూ అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖమేనీ హెచ్చరించారు. ఇక తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నేను అది చేయవచ్చు. నేను అది చేయకపోవచ్చు. అంటే నేను ఏమి చేయబోతున్నానో ఎవరికీ తెలియదు.’’ అని ట్రంప్ తెలిపారు.
🚨 🚨 🚨 SOROKA HOSPITAL IN ISRAEL HIT BY IRANIAN BALLISTIC MISSILE pic.twitter.com/xK2HBPSeeV
— Breaking911 (@Breaking911) June 19, 2025