ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇప్పటికే ఇరుదేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌లోని సోరోకా హాస్పిటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇరు పక్షాలు పరస్పరం వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ క్షిపణి ఇజ్రాయెల్‌లోని ప్రధాన ఆస్పత్రిని ఢీకొట్టింది. దీంతో ఆస్పత్రిలోని కొంత భాగం ధ్వంసమైంది.