తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ ముఖ్య పాత్రలో మెరవనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. అమిర్ ఖాన్ ఈ సినిమాలో కనిపించేది కేవలం 10 నిమిషాలే అయినా చాలా పవర్ఫుల్ రోల్ అనే టాక్ ఉంది.
Also Read : Kannappa : కన్నప్ప పై దుష్ప్రచారం.. లేఖ విడుదల చేసిన రచయిత
ఇక సూపర్ స్టార్ నటిస్తున్న మరొక భారీ మల్టీస్టారర్ చిత్రం జైలర్ 2. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలో మలయాల స్టార్ మోహన్ లాల్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ను నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నాడట. అతడే కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. గతంలో షారుక్ నటించిన రావన్ సినిమాలో రజినీ కాంత్ స్పెషల్ క్యామియోలోకనిపించారు. ఇప్పుడు రజనీ కాంత్ సినిమాలో షారుక్ కనిపించబోతున్నాడని సమాచారం. ఇప్ప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదే నిజమైతే జైలర్ 2 ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమాగా మారుతుందనడంలో సందేహం లేదు. SunPictures #TheSuperSaga