Pakistan: శుక్రవారం రోజు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై విషం వెళ్లగక్కాడు. ఐక్యరాజ్యసమితి వేదికగా అన్ని అబద్ధాలనే ప్రచారం చేశాడు. జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంపై తామే గెలిచామంటూ, భారతదేశాన్ని శత్రువుగా అభివర్ణించాడు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నాడు. పహల్గామ్ దాడిపై నిష్పాక్షిక అంతర్జాతీయ దర్యాప్తు కోసం తాను విజ్ఞప్తి చేశానని, కానీ భారతదేశం ఆ ప్రతిపాదనను తిరస్కరించి, ఈ విషాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించాడు.
Read Also: Pakistan: హిందుత్వం ప్రపంచానికి ప్రమాదమట.. భారత్‌పై విషం కక్కిన దాయాది దరిద్రుడు..
పాకిస్తాన్‌పై ఎలాంటి బాహ్యదాడిని తాము సహించేది లేదని గతేడాది యూఎన్‌లో చెప్పానని, ఇప్పుడు అదే నిజమైందని అన్నారు. ఈ ఏడాది మేలో పాకిస్తాన్ నుంచి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే దాడి జరిగిందని భారత్‌పై ఆరోపణలు గుప్పించాడు. ఈ సంఘర్షణ సమయంలో పాకిస్తాన్ బలమైన స్థానంలో ఉన్నప్పటికీ, కాల్పుల విరమణకు మద్దతు ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో ఈ ప్రాంతంలో ఒక పెద్ద యుద్ధం ఆగిందని పొగడ్తలు కుపించాడు. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదించాడు.
వివాదాస్పద అంశాలపై భారత్‌తో చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని, దక్షిణాసియాకు వివేకవంతమైన నాయకులు అవసరమని, రెచ్చగొట్టే నాయకులు కాదని అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపేసిందని చెప్పారు. ఇది అంతర్జాతీయ చట్టాన్ని కూడా ఉల్లంఘించడమే అని అన్నారు.పాకిస్తాన్ తన 240 మిలియన్ల ప్రజల నీటి హక్కులను కాపాడుతుందని, సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని చెప్పారు. కాశ్మీర్ ప్రజలకు తాము అండగా నిలుస్తామని అన్నారు. ఐక్యరాజ్యసమితి చట్టం ప్రకారం ఒక రోజు కాశ్మీర్లో న్యాయమైన ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని, కాశ్మీరీలు స్వయంగా నిర్ణయించుకునే అధికారం పొందుతారని తాను విశ్వసిస్తున్నానని ఆయన చెప్పారు.