Ukraine Crisis : ముగిసిన రెండవ విడత శాంతి చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుద్ధ భూమి నుంచి సాధారణ పౌరుల తరలింపునకు ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు అంగీకరించారు. రెండో విడత చర్చల్లో భాగంగా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు మధ్య బెలారస్లో చర్చలు జరిగాయి. ఈ యుద్దంలో భారీ సంఖ్యలో సాధారణ పౌరులు మరణిస్తుండటం వల్ల ఈ నిర్ణయానికి ఇరుదేశాలు అంగీకరించాయి. పోలిష్-బెలారసియన్ సరిహద్దుల్లో బ్రెస్ట్ లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం జరిగింది. అయితే ఈ చర్చలు ఆలస్యం అయ్యే కొద్దీ మా డిమాండ్ల జాబితాను పెంచుతామన్న రష్యా వెల్లడించింది. పౌరులు, చిక్కుకుపోయున విదేశీయులు ఉక్రెయిన్ ను విడిచి వెళ్ళేందుకు మార్గం సుగమం చేసిందుకు, సహకరించేందుకు ఇరుదేశాలు అంగీకారించాయి. పౌరులు క్షేమంగా ఉక్రెయిన్ నుంచి వెళ్ళే అంశంలోనే ఇరు దేశాల మధ్య పరిష్కారం లభించింది.
కానీ, ఉక్రేయిన్ కు కావాలసిన ఫలితాలు ఇంకా సాధించకుండానే చర్చలు ముగిశాయని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం సలహాదారు మైఖేల్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మాక్రాన్ ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తర్వాతనే చర్చలుకు మార్గం సుగమం అయ్యింది. ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు, మరింత వినాశనం జరగనుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మాక్రాన్ భావిస్తున్నారు. ఉక్రెయిన్ను రష్యా స్వాధీనం చేసుకుంటే, ఆ తర్వాత బాల్టిక్ రాజ్యాలదే వంతు అని, యుధ్దం ఆగాలంటే, నేరుగా పుతిన్ తో ముఖాముఖి చర్చలు జరపడమే ఏకైక పరిష్కారమని జెలెన్ స్కీ అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!