Dinosaur eggs: జెయింట్ క్రిస్టల్‌తో నిండిన రెండు డైనోసార్ గుడ్లను కనుగొన్న శాస్త్రవేత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dinosaur eggs: చైనాలో రెండు జెయింట్ క్రిస్టల్‌తో నిండిన డైనోసార్ గుడ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొత్తగా కనుగొనబడిన గుడ్లు డైనోసార్ కొత్త జాతికి చెందినవని భావిస్తున్నారు. కాల్సైట్ స్ఫటికాల సమూహాలతో నిండిన ఫిరంగి పరిమాణంలో ఉన్న డైనోసార్ గుడ్లను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. రెండు శిలాజ గుడ్లు చైనాలో అన్హుయ్ ప్రావిన్స్‌లోని కియాన్షాన్ బేసిన్లో కనుగొనబడ్డాయి. ఈ అద్భుతమైన ఆవిష్కరణను చైనీస్ నిపుణులు కొత్త పరిశోధనా పత్రంలో వివరించారు. ఇది జర్నల్ ఆఫ్ పాలియోజియోగ్రఫీలో ప్రచురించబడింది.
రెండు దాదాపు సంపూర్ణ గుండ్రని గుడ్లు క్రెటేషియస్ కాలం నాటివి – డైనోసార్ల యుగం చివరి కాలం నాటివని.. అవి కొత్త డైనోసార్ జాతికి చెందినవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గుడ్ల పెద్ద పరిమాణం, గుడ్డు షెల్ యూనిట్ల గట్టి అమరిక, అలాగే వాటి ప్రత్యేకమైన గోళాకార ఆకృతిని బట్టి దీనిని కనుగొన్నారని పాలియోంటాలజిస్టులు వివరించారు. ఇంకా, నిపుణులు వాతావరణ ప్రభావాల కారణంగా, కొత్తగా కనుగొన్న డైనోసార్ గుడ్లలో గుడ్డు పెంకులు, సంబంధిత ద్వితీయ గుడ్డు షెల్ యూనిట్లు భద్రపరచబడలేదని వివరించారు.
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
PM Modi Gifts: ప్రధాని మోడీ బహుమతుల ఈ-వేలాన్ని ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక శాఖ
గుడ్లలో ఒకటి పాక్షికంగా దెబ్బతిన్నదని, అందువల్ల దాని అంతర్గత సమూహాలలో ఉన్న కాల్సైట్ స్ఫటికాలు బయటపడ్డాయని వారు తెలియజేశారు. రెండూ దాదాపు గోళాకారంలో ఒక్కొక్కటి వరుసగా పొడవు 4.1 అంగుళాలు, 5.3 అంగుళాలు ఉండగా.. వెడల్పు 3.8 అంగుళాలు, 5.2 అంగుళాల మధ్య ఉంటాయి. ఇది ఫిరంగి బంతికి సమానమైన పరిమాణంలో ఉంటుంది. పరిశోధకుల ప్రకారం, గుడ్లు షిక్సింగూలిథస్ కియాన్షానెన్సిస్ అని పిలువబడే కొత్త జాతిని సూచిస్తాయి. కొత్తగా కనుగొన్న గుడ్లు ఆర్నిథోపాడ్లకు చెందినవని వారు వెల్లడించారు. అంటే చిన్న, మొక్కలను తినే బైపెడల్ డైనోసార్లు.
తాజావార్తలు
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!