Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
- రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు
- మక్కాలో మూడు దేశాలు సమావేశం
- సమష్టి భద్రతను బలోపేతం కోసమే ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాలు సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. శుక్రవారం మక్కాలో జరిగిన కార్యక్రమంలో మూడు దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ప్రాంతీయ సంక్షోభం, గల్ఫ్ దేశాలపై క్షిపణి దాడుల నేపథ్యంలో తమ సమష్టి భద్రతను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.

Also Read
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
- US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
ఈ ఒప్పందానికి ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’గా పేరు పెట్టారు. అయితే ఒప్పందంలో మూడు దేశాలు ఎలాంటి నిర్దిష్ట బాధ్యతలు లేదా కట్టుబాట్లను స్వీకరించాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం బయటకు రాలేదు. అయితే శుక్రవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో.. ఈ ఒప్పందం ద్వారా మూడు దేశాల సమష్టి భద్రతను బలోపేతం చేయడం, ప్రాంతీయంగా అలాగే అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత, సుస్థిరతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే మధ్యప్రాచ్యంలో విస్తృత స్థాయిలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలోని చమురు ఎగుమతి దేశాలపై క్షిపణి దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ తమ భద్రతా సహకారాన్ని మరింత పెంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందంతో మూడు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రాంతీయ భద్రత, శాంతి, స్థిరత్వం కోసం సమష్టిగా పనిచేయడానికి ఈ ఒప్పందం ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇక ఈ పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
తాజావార్తలు
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!