శాన్ డియాగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నివాస వీధిలో చిన్న విమానం కూలిపోయింది. దీంట్లో ప్రయాణిస్తున్న ఆరుగురు చనిపోయారు. ఇక మరణించిన వారిలో ప్రముఖ సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో ఉన్నట్లు గుర్తించారు. నివాసాల మధ్యలో విమానం కూలిపోవడంతో ఇళ్లులు, కార్లు దగ్ధమైపోయాయి.
ఇది కూడా చదవండి: Today Gold Rate: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
ఇక సంగీత ఏజెంట్ డేవ్ షాపిరో సౌండ్ టాలెంట్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు. స్టోరీ ఆఫ్ ది ఇయర్ మరియు పియర్స్ ది వీల్ వంటి రాక్ బ్యాండ్‌లు ఉన్నాయి. మాజీ డ్రమ్మర్ డేనియల్ విలియమ్స్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారని, అందరూ మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మర్ఫీ కాన్యన్ పరిసరాల్లో ఒక ఇల్లు ధ్వంసమైందని.. మరో 10 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. కార్లు దగ్ధమయ్యాయి.
ఇది కూడా చదవండి: Bangladesh: రాజీనామా యోచనలో యూనస్! కారణమిదే!
షాపిరోతో సహా విమాన ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులను కోల్పోయినట్లు కంపెనీ తెలిపింది. ఇక ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు శాన్ డియాగో అధికారులు తెలిపారు. మరణించిన వారి పేర్లు ఇంకా అధికారింగా ప్రకటించలేదు.
షాపిరో సంగీతంతో పాటు మంచి పైలట్ అని విమానయాన సంస్థ వెలాసిటీ ఏవియేషన్ తెలిపింది. 15 సంవత్సరాలు అనుభవం ఉందని తెలిపింది. విమానం నడపడంలో మంచి ఆసక్తి కలిగిన వ్యక్తిగా పేర్కొంది. ప్రమాదానికి గురైన విమానంలో 10 మంది ప్రయాణించొచ్చని.. అయితే ప్రమాద సమయంలో ఆరుగురు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుందన్నారు. స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:45కి ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఒక్కసారిగా విమానం కూలినప్పుడు విద్యుత్ తీగలను తాకి నివాసాల మధ్యకు దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం సంభవించినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక ప్రమాదానికి ముందు విమానంలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విమానం శాన్ డియాగో డౌన్‌టౌన్‌కు ఉత్తరాన 10 కి.మీ (ఆరు మైళ్ళు) దూరంలో ఉన్న మోంట్‌గోమెరీ ఫీల్డ్ విమానాశ్రయానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
