NTV Telugu Site icon

Russia Ukraine War: దేవుడా మాకొద్దు ఈ యుద్ధం.. దేశం వదలి పారిపోతున్న ఉక్రెయిన్ సైనికులు

Ukrine

Ukrine

Russia Ukraine War: రష్యా దూకుడుగా దాడి చేస్తుండటంతో ఉక్రెయిన్‌ సైనికులు డీలా పడ్డారు. దీంతో రేపోమాపో కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు మొదలైతే ఉక్రెయిన్‌ రష్యాతో గట్టిగా బేరమాడలేని స్థితిలోకి జారిపోతుంది. రష్యాతో యుద్ధం మూడో ఏడాదిలోకి ప్రవేశించగా, అదనపు సైనికులను, ముఖ్యంగా 18 ఏళ్లు పైబడిన వారినీ ఆర్మీలోకి తీసుకోవాలని అమెరికా కీవ్‌పై బాగా ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ, 2022 ఫిబ్రవరిలో రష్యా దాడి చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష మంది ఉక్రెయిన్‌ సైనికులు యుద్ధ రంగం వదలి పెట్టి పరార్ అయ్యారు.

Read Also: PM Modi: నేడు డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ

అయితే, నిజానికి ఉక్రెయిన్ సైన్యం సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని అనధికార లెక్కల్లో తేలింది. కానీ, గడచిన ఒక్క ఏడాదిలోనే 50,000 మంది ఉక్రెయిన్‌ సైనికులు సెలవు పెట్టకుండానే ఎక్కడికో వెళ్లిపోయారు. అదనపు సైనిక సమీకరణ స్టార్ట్ కావడానికి ముందు కీవ్ సైన్యంలో 3 లక్షల మంది మాత్రమే ఉండటాన్ని బట్టి ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శస్త్రచికిత్స, ఇతర ఆరోగ్య కారణాలను చూపి మెడికల్‌ లీవ్‌ తీసుకున్న సైనికులు మళ్లీ ఆర్మీలోకి తిరిగి రావడానికి ఇష్టపడటం లేదు.

Read Also: IND vs PAK U-19: నేడే దాయాదుల పోరు.. భారత్‌ను ఓడించే దమ్ము పాకిస్థానుకు ఉందా

ఇక, ఉక్రెయిన్ కు చెందిన ఓ సైనికుడు మాట్లాడుతూ.. రష్యన్లు మాపై 50 ఫిరంగులతో దాడి చేస్తే.. మేము ఒక్క గుండును మాత్రమే ప్రయోగించే స్థితిలో ఉన్నామని తెలిపాడు. మాస్కో దాడిలో మా మిత్రులు కళ్ల ముందే దారుణంగా చనిపోతుంటే.. మా పరిస్థితీ ఇలాగే అవుతుంది కదా అనే ఆందోళన మొదలైందన్నారు. 10 మైళ్ల వెనుక ఉన్న అధికారులు మాత్రం మమ్మల్ని ముందుకెళ్లండి అంటూ రష్యాపైకి పురిగొల్పుతుంటారని అసలు విషయాలను బయటపెట్టాడు. ఈ యుద్ధం ఎంతకూ ముగియకపోవడంతో సైన్యం పెద్ద బందిఖానాలా మారిపోయిందని మరో సైనికుడు చెప్పుకొచ్చాడు. పోరాటం చేసే వారు లేకపోవడం వల్లే ఉహ్లెదార్‌ పట్టణం రష్యా స్వాధీనం చేసుకుందన్నాడు. 120 మంది ఉండాల్సిన యూనిట్లలో కేవలం 10 మంది సైనికులు మాత్రమే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉక్రెయిన్ సైనికులు వాపోతున్నారు.