Russia Ukraine War: దేవుడా మాకొద్దు ఈ యుద్ధం.. దేశం వదలి పారిపోతున్న ఉక్రెయిన్ సైనికులు
- రష్యా దూకుడుతో బెంబేలెత్తిపోతున్న ఉక్రెయిన్ సైన్యం..
- దేవుడా మాకొద్దు ఈ యుద్ధమంటూ వాపోతున్న కీవ్ సైనికులు..
- యుద్ధ భూమి వదిలి పారిపోతున్న ఉక్రెయిన్ సోల్జర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War: రష్యా దూకుడుగా దాడి చేస్తుండటంతో ఉక్రెయిన్ సైనికులు డీలా పడ్డారు. దీంతో రేపోమాపో కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు మొదలైతే ఉక్రెయిన్ రష్యాతో గట్టిగా బేరమాడలేని స్థితిలోకి జారిపోతుంది. రష్యాతో యుద్ధం మూడో ఏడాదిలోకి ప్రవేశించగా, అదనపు సైనికులను, ముఖ్యంగా 18 ఏళ్లు పైబడిన వారినీ ఆర్మీలోకి తీసుకోవాలని అమెరికా కీవ్‌పై బాగా ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ, 2022 ఫిబ్రవరిలో రష్యా దాడి చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష మంది ఉక్రెయిన్ సైనికులు యుద్ధ రంగం వదలి పెట్టి పరార్ అయ్యారు.
Read Also: PM Modi: నేడు డీజీపీల సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోడీ
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
అయితే, నిజానికి ఉక్రెయిన్ సైన్యం సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని అనధికార లెక్కల్లో తేలింది. కానీ, గడచిన ఒక్క ఏడాదిలోనే 50,000 మంది ఉక్రెయిన్ సైనికులు సెలవు పెట్టకుండానే ఎక్కడికో వెళ్లిపోయారు. అదనపు సైనిక సమీకరణ స్టార్ట్ కావడానికి ముందు కీవ్ సైన్యంలో 3 లక్షల మంది మాత్రమే ఉండటాన్ని బట్టి ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శస్త్రచికిత్స, ఇతర ఆరోగ్య కారణాలను చూపి మెడికల్ లీవ్ తీసుకున్న సైనికులు మళ్లీ ఆర్మీలోకి తిరిగి రావడానికి ఇష్టపడటం లేదు.
Read Also: IND vs PAK U-19: నేడే దాయాదుల పోరు.. భారత్‌ను ఓడించే దమ్ము పాకిస్థానుకు ఉందా
ఇక, ఉక్రెయిన్ కు చెందిన ఓ సైనికుడు మాట్లాడుతూ.. రష్యన్లు మాపై 50 ఫిరంగులతో దాడి చేస్తే.. మేము ఒక్క గుండును మాత్రమే ప్రయోగించే స్థితిలో ఉన్నామని తెలిపాడు. మాస్కో దాడిలో మా మిత్రులు కళ్ల ముందే దారుణంగా చనిపోతుంటే.. మా పరిస్థితీ ఇలాగే అవుతుంది కదా అనే ఆందోళన మొదలైందన్నారు. 10 మైళ్ల వెనుక ఉన్న అధికారులు మాత్రం మమ్మల్ని ముందుకెళ్లండి అంటూ రష్యాపైకి పురిగొల్పుతుంటారని అసలు విషయాలను బయటపెట్టాడు. ఈ యుద్ధం ఎంతకూ ముగియకపోవడంతో సైన్యం పెద్ద బందిఖానాలా మారిపోయిందని మరో సైనికుడు చెప్పుకొచ్చాడు. పోరాటం చేసే వారు లేకపోవడం వల్లే ఉహ్లెదార్ పట్టణం రష్యా స్వాధీనం చేసుకుందన్నాడు. 120 మంది ఉండాల్సిన యూనిట్లలో కేవలం 10 మంది సైనికులు మాత్రమే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉక్రెయిన్ సైనికులు వాపోతున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!