Ukraine Crisis: ఉక్రెయిన్ నగరాలపై రష్యా వరుస దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌కు దిగుతున్నట్లు రష్యా ప్రకటించిన వెంటనే సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై పేలుళ్లు జరిపాయి. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బలగాలు ఆక్రమించాయి. బోరిస్పిల్ ప్రాంతంలోనూ బాంబు దాడులు జరిగినట్టు చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌లో అతిపెద్ద రెండో నగరం ఖార్కివ్‌నూ రష్యా బలగాలు టార్గెట్ చేశాయి. మరోవైపు మరియపోల్, దినిప్రో, క్రమటోర్ప్క్, ఒడెస్సా, జపోర్గియా నగరాల్లోనూ రష్యా బలగాలు దాడులకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై దాడులు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను రష్యా ఖండించింది. ప్రజలు, జనావాసాలు తమ లక్ష్యం కాదని స్పష్టం చేసింది. కేవలం సైనిక స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్, ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని తెలిపింది. అతి కచ్చితత్వంతో టార్గెట్ ఛేదించే ఆయుధాలనే వాడుతున్నామని పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ విషయంలో సంయమనం పాటించాలన్న ప్రపంచ దేశాల విజ్ఞప్తిని రష్యా పట్టించుకోలేదని నాటో ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వతంత్ర దేశంపై యుద్ధంతో ఆ దేశ సార్వభౌమాధికారంపై దాడి చేస్తోందని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా పుతిన్ వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది. యుద్ధంతో సాధారణ పౌరుల జీవితాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. రష్యాపై చర్యకు నాటో సభ్య దేశాల నిర్ణయం ప్రకారం స్పందిస్తామని తెలిపింది.
Also Read
- Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్‌కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
- China halts J10CE Delivery: భారత్ రఫేల్‌పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీకి వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. తాజా పరిణామాలను గమనిస్తున్నామని తెలిపారు. రేపు జీ7 దేశాలతో భేటీ అవుతామని చెప్పారు.
తాజావార్తలు
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరం.!
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
-
Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!