ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 40 మంది మరణించారు. ఉక్రెయిన్‌లోని పోల్టావాలోని మిలిటరీ ఇన్‌స్టిట్యూట్‌పై రష్యా ప్రారంభించిన దాడిలో 40 మందికి పైగా మరణించారు. 180 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ భవనంపై రష్యా బలగాలు రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశాయని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఒక వీడియోలో తెలిపారు.
ఇది కూడా చదవండి: Petrol-Diesel Cars: వచ్చే ఏడాది నార్వేలో పెట్రోల్-డీజిల్ వాహనాల అమ్మకాలు నిలిపివేత.. భారత్ లో ఎప్పుడంటే?
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇరువైపులా ఆస్తులు ధ్వంసం అయ్యాయి. అలాగే ప్రాణనష్టం కూడా జరిగింది. ఓ వైపు చర్చలు జరుగుతున్న సత్‌ఫలితాలు ఇవ్వడం లేదు. ఇక తాజాగా జరిగిన దాడిలో ఉక్రెయిన్‌లో 40 మంది చనిపోయారు. అలాగే ఉక్రెయిన్ కూడా రష్యాపై ప్రతి దాడులు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Godavari: కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం.. మహారాష్ట్రకు రాకపోకలు బంద్
తనకు వచ్చిన ప్రాథమిక నివేదికల ప్రకారం రెండు బాలిస్టిక్ క్షిపణులతో రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. పోల్టావాలోని ఓ విద్యా సంస్థ, సమీపంలోని ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకున్నారని.. ఈ దాడిలో టెలీకమ్యూనికేషన్ ఇన్‌స్టిట్యూట్ భవనం సైతం పాక్షికంగా ధ్వంసమైందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. శిథిలాల కింద అనేకమంది చిక్కుకోగా.. పలువురిని రక్షించినట్లు తెలిపారు. కానీ ఈ ఘటనలో 180మందికి గాయాలయ్యాయని.. అనేకమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. ఇక ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఈ దాడులు జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొని బాధితుల ప్రాణాలు రక్షించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు.
ఇది కూడా చదవండి: Transgender love story: ప్రేమలో మోసపోయిన ట్రాన్స్ జెండర్.. 73 మంది అబ్బాయిలపై ప్రతీకారం!