రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్ల నుంచి యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు దేశాల్లో భారీ నష్టం జరిగింది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పురోగతి లభించలేదు. తొలుత సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిగాయి. అయినా కూడా ఫలితాన్నివ్వలేదు. అనంతరం ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో సమావేశం అయ్యారు. అనంతరం వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీ, ఈయూ దేశాధినేతలతో ట్రంప్ సమావేశమై చర్చలు జరిపారు. అయినా పంచాయతీ తెగలేదు. తాజాగా 28 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చారు. ఈ ప్రణాళిక రష్యాకు నచ్చింది గానీ.. జెలెన్‌స్కీకి నచ్చలేదు. ట్రంప్ దూతలు ఇరు పక్షాలతో చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. గత వారం అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో చర్చలు జరుగుతున్నాయి. మరోసారి ఆదివారం కూడా చర్చలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి:Virat Kohli : విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్.. ఆందోళనలో ఫ్యాన్స్
అయితే ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని రష్యా శాంతి చర్చలకు ఆహ్వానించింది. మాస్కోకు రావాలని కోరింది. గతేడాది కూడా ఇదే మాదిరిగా జెలెన్‌స్కీని ఆహ్వానించింది. కానీ అందుకు నిరాకరించారు. తాజాగా పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇస్తూ మాస్కోకు రావాలంటూ అడిగింది. రష్యా ఆహ్వానంపై ఇప్పటి వరకు జెలెన్‌స్కీ ఇంకా స్పందించ లేదు.
ఇది కూడా చదవండి: MOTN Survey: ఇప్పటి వరకు భారత్ చూసిన అత్యుత్తమ ప్రధాని ఎవరు..? సర్వేలో ఆసక్తికర విషయాలు..
జెలెన్‌స్కీ-పుతిన్ మధ్య సమావేశం ఏర్పాటు చేయడానికి చాలా దగ్గరగా ఉందని అమెరికాకు చెందిన ఒక అధికారి ఆక్సియోస్‌తో వెల్లడించారు. ఇక అబుదాబి వేదికగా మంచి చర్చలు జరుగుతున్నాయని మంగళవారం ట్రంప్ కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రాంతాల మార్పిడిపై పంచాయితీ తెగడం లేదు. భూభాగాలపై చర్చలు కొలిక్కి వస్తే యుద్ధానికి పరిష్కారం దొరికినట్లే. రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై ప్రధాన విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎవరికి ఏ భూభాగం లభిస్తుందనే దానిపై ఇరుపక్షాల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను పరిష్కరించడం చాలా కష్టం అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం పేర్కొన్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
