Rishi Sunak wants all pupils to study maths to age 18: యూకే ఆర్థిక సంక్షోభంతోె అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడ ద్రవ్యోల్భనం పెరిగింది. దీంతో పాటు ఇంధన సంక్షోభం ఆదేశాన్ని వేధిస్తోంది. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం మొత్తం యూరప్ దేశాలపై పడింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్రిటన్ ను గట్టేక్కించేందుకు కన్జర్వేటివ్ పార్టీ లిజ్ ట్రస్ ను కాదని భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ను ప్రధానిగా ఎన్నుకున్నారు.
Read Also: Vaarasudu Trailer: గ్రౌండ్‌లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా.. ఆడియన్స్ చూసేది ఒక్కరినే..!!
ఇదిలా ఉంటే ప్రధాని రిషి సునాక్ ప్రస్తుతం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూకేలో 18 ఏళ్ల విద్యార్థులు తప్పని సరిగా ‘మ్యాథ్స్’ని తప్పనిసరి చేశారు. 2023లో రిషి సునాక్ మొదటి ప్రసంగంలో కొన్ని అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నాడు. దీంట్లో గణితం తప్పనిసరి అనేది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జీవితంలో తాను పొందిన ప్రతీ అవకాశాన్ని విద్యనే అందించిందని ఇది నా ఉద్దేశపూర్వకంగా గ్రహించినట్లు వెల్లడించారు. ప్రతీ వ్యక్తికి అత్యున్నత స్థాయి విద్యను అందించడం రాజకీయాల్లోకి వచ్చానని రిషి సునాక్ తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యావ్యవస్థలతో మనం పోటీ పడలేకపోవడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదని అన్నారు.
ప్రస్తుతం 16-19 ఏళ్ల వయసు ఉన్న వారిలో కేవలం సగం మంది మాత్రమే గణితాన్ని అభ్యసిస్తున్నారని.. వీరిలో 16 ఏళ్ల వయసులో 60 శాతం మందికి ప్రాథమిన గణిత నైపుణ్యాలు లేవని అన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాలకు విద్యార్థులకు అనలిటికల్ సామర్థ్యం అవసరం.. వీటిని నేర్పించకుండా వారిని బయటకు పంపడం మన పిల్లలను నిరాశకు గురిచేస్తుందని.. అందుకే 18 ఏళ్ల వయసు వరకు గణితం తప్పనిసరి అని తెలిపారు.