Remi Lucidi: విషాదాంతంగా ముగిసిన సాహస యాత్రికుడి ప్రయాణం.. 68వ అంతస్తు నుంచి పడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Remi Lucidi Known For Extreme Sports Dies After Falling Off From Building In Hong Kong: అత్యంత ఎత్తైన భవనాలను అధిరోమిస్తూ ‘డేర్ డెవిల్’గా పేరొందిన రెమీ లుసిడి.. ప్రమాదవశాత్తు ఒక భవనంపై నుంచి కిందకు జారిపడి మృతి చెందాడు. ప్రమాదాలతో చెలగాటమాడే ఈ 30 ఏళ్ల లుసిడి.. తాజాగా ఓ సాహసం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్‌ను అధిరోహించాలని ప్రయత్నించి కిందకు జారిపడ్డాడు. అతను కింద పడిపోవడానికి ముందు.. 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్ కిటికీ బయట చిక్కుకుపోయాడు. దాన్ని బలంగా తన్నడంతో, అతని కాలు పట్టుతప్పింది. దీంతో నేరుగా కిందపడి, సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
Cessna 177: సముద్రంలో ల్యాండ్ అయిన విమానం.. కారణమిదే.. చివరికి ఏమైంది?
Also Read
- America Vs Iran: డెడ్‌లైన్ ముగిసింది! యుద్ధమా? లొంగుబాటా?
- Explainer: గల్ఫ్‌లో కొత్త ముసలం మొదలైందా? శత్రువులగా మారిన ప్రాణ స్నేహితులు!
- Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
- AI Weight Loss Plan: AI డైట్ ప్రమాదకరంగా మారిందా? 45 రోజుల్లో 20 కిలోలు తగ్గి ఐసీయూకు!
హాంకాంగ్ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. లుసిడి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్‌కు చేరుకొని, 40వ అంతస్తులో తన స్నేహితుడ్ని కలవడానికి వెళ్తున్నానని సెక్యూరిటీ గార్డుకి చెప్పి, లోపలికి వెళ్లాడు. ఎంతకైనా మంచిది, ఒకసారి నిర్ధారించుకుందామని.. 40వ అంతస్తులో ఉండే వ్యక్తికి సెక్యూరిటీ గార్డు ఫోన్ చేశాడు. అయితే.. ఆ వ్యక్తి తనకు లుసిడి ఎవరో తెలియదని సెక్యూరిటీ గార్డుకి సమాధానం ఇచ్చాడు. అప్పటికే లుసిడి చాకచక్యంగా సెక్యూరిటీ కళ్లు గప్పి.. లోపలికి వెళ్లి, ఎలివేటర్లో దూరాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. 49వ అంతస్తులు మెట్లు ఎక్కుతూ లుసిడి కనిపించాడు. ఉదయం 7:38 సమయంలో.. లుసిడి పెంట్‌హౌస్ బయట కిటికీ తడుతూ.. ఒక పని మనిషికి కనిపించాడు. అతడ్ని చూసి ఖంగుతిన్న ఆమె.. పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది.
Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మీదుగా మరో వందే భారత్ ట్రైన్.. నేడు ట్రయల్ రన్
మరోవైపు.. లుసిడి కాలు ఆ పెంట్‌హౌస్ కిటికీలో ఇరుక్కుంది. దాన్నుంచి బయటపడేందుకు అతడు బలంగా కాలితో కిటికీని తన్నాడు. ఈ క్రమంలోనే బ్యాలెన్స్ తప్పి.. అతడు కిందకు పడ్డాడు. 68వ అంతస్తు నుంచి కిందపడటంతో.. అతడు స్పాట్లోనే చనిపోయాడు. ఘటనా స్థలంలో లుసిడి కెమెరాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లుసిడి మరణవార్త విని.. అతని అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.
తాజావార్తలు
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Rhea Chakraborty: సుశాంత్ మరణం నా జీవితాన్నే మార్చేసింది.. నాన్నకు ఉద్యోగం కూడా పోయింది: రియా చక్రవర్తి
-
Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
-
Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
ట్రెండింగ్
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!