Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
- ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం ఆరోపణల్ని ఖండించిన ఖతార్..
- మమ్మల్ని బలిపశువు చేయొద్దని కౌంటర్..
- అరబ్ ఓటర్లకు డబ్బులు ఇచ్చారనే ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో అరబ్ ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బులు ఖర్చు చేసిందన్న ఆరోపణల్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది. తమ దేశాన్ని ఇజ్రాయిల్ రాజకీయ నాయకుల వైఫల్యాలకు బలిపశువును చేయొద్దని దోహా స్పష్టం చేసింది. ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగిందన్న అనుమానాలపై ఇజ్రాయిల్ అంతర్గత భద్రత సంస్థ షిన్ బెట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఖతార్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి తమ దేశం ఎలాంటి జోక్యం చేసుకోలేదని, ఇందుకోసం నిధులు సమకూర్చలేదని స్పష్టం చేశారు. కొంత మంది ఇజ్రాయిల్ నాయకులు, వారికి అనుకూలంగా ఉన్న మీడియా వర్గాలు ఖతార్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, తప్పుడు సమాచారా ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇజ్రాయిల్ రాజకీయ వివాదాల్లోకి ఖతార్‌ను లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
Also Read
- ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
- Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్‌తో చర్చలు.. పక్కా ప్లాన్‌తో రెజిమ్ ఛేంజ్?
- Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
- Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
దీనికి ముందు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా వామపక్ష రాజకీయ వర్గాలను ప్రభావితం చేసిందని ఖతార్‌పై ఆరోపనలు చేశారని, ఇప్పుడు అరబ్ ఓటర్ల విషయంలోనూ ఇదే తరహా ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. నెతన్యాహు ప్రధాన ప్రత్యర్థి గాడి ఐసెన్కాట్ కూడా ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగిందన్న అనుమానాలపై తనకు సమాచారం అందుతోందని తెలిపారు. ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, ముఖ్యంగా హమాస్‌కు నిధులు అందిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశం ప్రమేయం ఉంటే అది ఆందోళనకరమని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఖతార్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, హమాస్‌తో ఈ దేశానికి సంబంధాలు ఉన్నాయనేది బహిరంగం రహస్యం.
నెతన్యాహూ కూటమికి ఆధిక్యం..
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూటమి 53-54 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. గాడి ఐసెన్కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి సుమారు 48 స్థానాలు వస్తాయని అంచనా. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మెజారిటీని ఏ కూటమి సాధించలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. సుమారు 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి అరబ్ పార్టీలు కలిపి 19 స్థానాలు గెలుచుకున్నట్లు నివేదికలు తెలిపాయి. ఇజ్రాయిల్ మొత్తం ఓటింగ్ శాతం 77.7గా ఉండగా, అరబ్ కమ్యూనిటీలో సుమారు 60 శాతం ఓటింగ్ నమోదైంది.
ఖతార్, టర్కీలపై ఆరోపణలు..
అరబ్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఖతార్, టర్కీ వంటి విదేశీ శక్తులు నిధులు సమకూర్చాయా? అనే కోణంలో షిన్ బెట్ విచారణ చేస్తున్నట్లు ‘ది జెరూసలెం పోస్ట్’ నివేదించింది. ఇజ్రాయెల్ సెంట్రల్ ఎలక్షన్స్ కమిటీ చైర్మన్ జస్టిస్ నోమ్ సోల్బర్గ్ ఆదేశాల నేపథ్యంలో ఈ విచారణ ప్రారంభమైనట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ఎన్నికల్లో పోటీ చేసిన అరబ్ పార్టీల కూటమి జాయింట్ లిస్ట్.. నెతన్యాహూ ఎన్నికల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది. ఇది ఎన్నికల ఫలితాలను బలహీనపరిచే ప్రయత్నమని ప్రకటించింది. నవంబర్ 4న తుది ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
-
Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
-
Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?