Putin: పుతిన్‌ని ఎలుగుబంటి నుంచి రక్షించిన వ్యక్తికి అత్యున్నత పదవి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకప్పటి తన పర్సనల్ బాడీగార్డు అయిన అలెక్సీ డ్యూమిన్కి అత్యున్నత పదవి కట్టబెట్టారు. 51 ఏళ్ల డ్యూమిన్ని స్టేట్ కౌన్సిల్ సెక్రటరీగా పుతిన్ నియమించారు. దేశీయ విదేశాంగ విధానం, వ్యూహాత్మక లక్షణాలు అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించే ఈ అత్యున్నత సంస్థలో డ్యూమిన్ కీలకం కానున్నారు. స్టేట్ కౌన్సిల్ ప్రభుత్వ అధికారులు, చట్టసభ సభ్యులు, ప్రాంతీయ నాయకులతో ఉంటుంది.
Read Also: Attempted Murder Case: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి, మరో ముగ్గురి అరెస్ట్
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
71 ఏళ్ల పుతిన్ ఐదోసారి రష్యా అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నెల నిర్వహించిన పదవుల కేటాయింపుల్లో డ్యూమిన్ రష్యాలోని తులా రీజియన్ నుంచి గవర్నర్‌గా క్రెమ్లిన్‌కి మరింత సన్నిహితంగా మారనున్నారు. 1999 నుంచి పుతిన్ యొక్క వ్యక్తిగత భద్రతలో డ్యూమిన్ పనిచేశారు. అతని సన్నిహిత అంగరక్షకుల్లో ఒకరిగా ఎదిగారు. ఒకప్పుడు ఎలుగుబంటి దాడి నుంచి అధ్యక్షుడు పుతిన్ నుంచి రక్షించాడనే పేరు డ్యూమిన్కి ఉంది. పుతిన్‌లో ఐస్ హాకీ ఆడే అత్యంత సన్నిహిత అధికారుల్లో డ్యూమిన్ కూడా ఉన్నారు.
2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను పుతిన్ స్వాధీనం చేసుకోవడంలో డ్యూమిన్ కీలకపాత్ర పోషించారు. రష్యా జీఆర్యూ మిలిటరీ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఆపరేషన్ డివిజన్‌కి ఇతను డిప్యూటీ హెడ్‌గా పనిచేశారు. మాజీ డిప్యూటీ డిఫెన్స్ మినిష్టర్‌గా పనిచేసిన డ్యూమిన్పై ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. ఇటీవల పుతిన్ తన దీర్ఘకాల మిత్రుడు సెర్గీ షోయిగును రక్షణ మంత్రిగా తొలగించారు. ఈ నిర్ణయం తర్వాత డ్యూమిన్ పదోన్నతి పొందారు. సెర్గీ షోయిగు స్థానంలో కొత్త రక్షణ మంత్రిగా మాజీ ఉప ప్రధాని ఆండ్రీ బెలౌసోవ్ని రక్షణ మంత్రిగా నియమించారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..