Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
- పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం
- నిఘా వ్యవస్థలపై కీలక నిర్ణయం
- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ప్రపంచ దేశాల్లో భద్రతా వ్యవస్థలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరహా దాడులు జరగవచ్చేమోనని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందులో భాగంగానే పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆయనకు అత్యంత సన్నిహితుల భద్రత కోసం ఉపయోగించే ప్రత్యేక నిఘా కెమెరా వ్యవస్థలోని కొన్ని భాగాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఖమేనీ హతమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఘటన అనంతరం ఇలాంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి రష్యా నాయకులను కూడా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
మాస్కో నగరంలో ప్రజల పర్యవేక్షణ కోసం ఉపయోగించే దాదాపు 3 లక్షల కెమెరాల వ్యవస్థకు భిన్నంగా.. పుతిన్ భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిఘా నెట్‌వర్క్‌ను తాత్కాలికంగా ఆఫ్‌లైన్‌లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇంజినీర్లు ఆ వ్యవస్థను పూర్తిగా పరిశీలించి.. ఇంటర్నెట్తో ఉన్న అనుసంధానాలను పూర్తిగా వేరు చేసే ప్రయత్నాలు చేసినట్లు వెల్లడైంది. భద్రతా తనిఖీలు పూర్తైన తర్వాతే ఆ నెట్‌వర్క్‌ను తిరిగి ప్రారంభించినట్లు తెలిసింది. ఇరాన్లో జరిగిన ఘటనల్లో ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలు అక్కడి నిఘా కెమెరా వ్యవస్థలను ఉపయోగించి కీలక అధికారుల కదలికలను గుర్తించాయని వచ్చిన నివేదికల నేపథ్యంలో రష్యా ఈ చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.
ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత అభివృద్ధితో నిఘా వ్యవస్థలు మరింత శక్తివంతమైన గూఢచారి సాధనాలుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్దిష్ట సమాచారం కోసం మాత్రమే శోధన సాధ్యమయ్యేది. అయితే తాజా AI వ్యవస్థలు సహజ భాషలో ఇచ్చే ఆదేశాల ఆధారంగా లక్షల గంటల వీడియోలను వేగంగా విశ్లేషించి వ్యక్తుల ప్రవర్తన, కదలికలు, సమావేశాల వివరాలను గుర్తించగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నిఘా కెమెరా వ్యవస్థలు భద్రతకు ఉపయోగపడటంతో పాటు.. శత్రుదేశాల చేతుల్లో పడితే ప్రమాదకర ఆయుధాలుగా మారే అవకాశం ఉందని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) హెచ్చరించినట్లు సమాచారం. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రస్తుతం తమ నిఘా వ్యవస్థల భద్రతను పునఃసమీక్షిస్తున్నాయని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!