Russia: కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి, పెంచిన తల్లులకు ‘మదర్ హీరోయిన్’ అవార్డును అధ్యక్షుడు పుతిన్ ప్రదానం చేయనున్నారు. మదర్ హీరోయిన్ అవార్డుకు ఎంపికైన మహిళలకు రూ.13 లక్షల నగదును అందిస్తారు. ఈ అవార్డు 1990-94 మధ్య కాలంలో ఉండేది. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ అవార్డును నిలిపివేశారు. కొన్నినెలల కిందట రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీన్ని మళ్లీ పునరుద్ధరించగా తాజాగా అవార్డులను ప్రదానం చేయడం మొదలుపెట్టారు. ఈ అవార్డు పొందాలంటే వాళ్లు రష్యా ఫెడరేషన్ పౌరులై ఉండాలి. 10వ శిశువు ఫస్ట్ బర్త్ డే తర్వాత ఈ రివార్డు అందుకునేందుకు మహిళలు అర్హత సాధిస్తారు.
Read Also: Smoking in Marathon: వీడెవడండీ బాబూ.. సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్లు పరిగెత్తాడు
ఈ అవార్డు గ్రహీతల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్నేహితుడు రమ్జాన్ కదిరోవ్ భార్య మెద్నీ కూడా ఉన్నారు. అలాగే ఆర్కిటిక్ యమలో నెనెట్స్ ప్రాంతానికి చెందిన మరో మహిళ కూడా ఈ అవార్డును దక్కించుకున్నట్లు రష్యా ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఇటీవల కోవిడ్ ప్రభావం, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాలో జనాభా భారీగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల ఇప్పటివరకు దాదాపు 50 వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఏ మహిళైనా కనీసం 10 మంది పిల్లలకు జన్మనిస్తే.. ఆ మహిళకు రష్యా కరెన్సీలో రూ.13 లక్షల నగదును బహుమతిగా ఇస్తామని పుతిన్ ప్రకటించారు.