POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
- పీఓకేలో మిన్నంటుతున్న నిరసనలు..
- హక్కుల కోసం నినదిస్తున్న ప్రజలు..
- పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో పాకిస్తాన్ ఆర్మీ దాష్టీకాలకు తెగబడుతోంది. హక్కుల కోసం ఆందోళన చేస్తున్న నిరసనకారులపై కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో 30 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మరణాల సంఖ్య 100ను దాటినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) నిర్వహించిన “ముజఫరాబాద్‌కు లాంగ్ మార్చ్” సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి, పాకిస్థాన్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిరసనకారులు , భద్రతా సిబ్బందితో తలపడ్డారు. ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీప్ జనరల్ అసిమ్ మునీర్‌కు, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అసిమ్ మునీర్ ఒక ఉగ్రవాది, ఐఎస్ఐ ఒక ఉగ్రవాది’’ అంటూ ప్రజలు నినదించారు. నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలో పీఓకే అంతటా పాక్ ఆర్మీ మోహరించింది.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
మరోవైపు, అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు ఖ్వాజా మెహ్రాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ‘‘ఈ రోజును లిఖించుకోండి మరియు భవిష్యత్ తరాలకు చెప్పండి, మనం వారి పారామిలిటరీ దళాలకు తలవంచకుండా నిలబడ్డామని, వారికి భయపడలేదని’’ అని అన్నారు. నిరసనల్లో ప్రజలు చేరాలని రావల్కోట్ ప్రాంతంలోని పలు మసీదుల నుంచి ప్రకటనలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ భూభాగంపై విదేశీ శక్తులు దాడి చేశాయని, కాశ్మీరీలందరూ సుదీర్ఘ పాదయాత్రలో పాల్గొని తమ జాతీయ గౌరవాన్ని ప్రదర్శించాలని ప్రకటనల్లో చెపపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..