PoK Protest: ప్లీజ్ మాకు సాయం చేయండి.. భారత్‌ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్..
- భారత్ సాయాన్ని కోరుతున్న పీఓకే ప్రజలు..
- పీఓకే ఉద్యమాన్ని అణచివేస్తున్న పాకిస్తాన్..
- ఆహారం, మందులు అందకుండా పాక్ కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీ్ర్(పీఓకే)లో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ అణచివేతకు నిరసనగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. రోజురోజుకు ఈ ఉద్యమం తీవ్రమవుతోంది. 26 రోజులుగా ప్రజలు పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ఈ నిరసనల్ని పాక్ క్రూరంగా అణచివేస్తోంది. శాంతియుత నిరసన చేస్తున్నవారిపై కాల్పులు జరుపుతోంది. మరోవైపు, పాకిస్తాన్ నుంచి పీఓకే ప్రాంతానికి వెళ్లే సరకుల్ని, మందులను నిలిపేసింది.
ఈ నేపథ్యంలో, తమకు సాయం చేయాలని పీఓకే ప్రజలు భారత్‌ను కోరుతున్నారు. భారతదేశంలో, నియంత్రణ రేఖకు(LoC) అవతల నివసిస్తున్న ప్రజల సాయాన్ని అభ్యర్థిస్తూ, ఉద్యమ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రావల్ కోట్ ఈద్గా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తాము తీవ్రమైన ఆహార, ఔషధ కొరతను ఎదుర్కొంటున్నామని, మనమంతా నియంత్రణ రేఖ వైపు వెళ్లాలా? అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. దీనికి అంతా అటువైపే వెళ్లండి అంటూ సమాధానం ఇచ్చారు.
Also Read
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం కాల్పులతో సమాధానం ఇస్తే, వారికి ఇతర మార్గాలు ఉన్నాయని హెచ్చరించారు. నిర్ణీత సమయంలోగా తమ డిమాండ్లను నెరవేర్చకుంటే జూలై 8న తదుపరి దశ నిరసనల్ని ప్రకటిస్తామని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేఏఏసీ) హెచ్చరించింది. ఇదిలా ఉంటే పీఓకే అణచివేతకు నిరసనగా వేలాది మంది ప్రవాసీ కాశ్మీరీలు లండన్‌లో భారీ మార్చ్ నిర్వహించారు. విద్యుత్ ధరలు, గోధుమ పిండి, ఇతర హక్కుల కోసం పీఓకే ప్రజలు గళమెత్తుతున్నారు. ఇదే కాకుండా కాశ్మీరీ శరణార్థులకు పీఓకే శాసనసభలో రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని చేపట్టారు.
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్‌తో గొడవ.. యశస్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!