Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Meloni: ఇటలీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది.. మోడీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో మోడీతో కలిసి దిగిన ఓ కొత్త సెల్ఫీని పంచుకుంటూ “రోమ్కు స్వాగతం, నా మిత్రమా!” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోగా.. ఆ తర్వాత మెలోనితో కలిసి దిగన నాలుగు ఫొటోలను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.. “రోమ్కు చేరుకున్న అనంతరం ప్రధాని మెలోనితో డిన్నర్ సందర్భంగా సమావేశమయ్యే అవకాశం లభించింది. అనంతరం చారిత్రాత్మక కొలస్సియంను సందర్శించాం. పలు కీలక అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం. భారత్-ఇటలీ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై నేటి చర్చల కోసం ఎదురుచూస్తున్నాను.” అంటూ తన ఎక్స్ ఖాతా (ట్విట్టర్)లో రాసుకొచ్చారు ప్రధాని మోడీ..
ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోమ్ చేరుకున్న అనంతరం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాత్రి విందు సందర్భంగా ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం అయిన Colosseumను కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “రోమ్ చేరుకున్న తర్వాత ప్రధాని మెలోనితో డిన్నర్ సమావేశం జరిగింది. అనంతరం చారిత్రక కొలస్సియంను సందర్శించే అవకాశం లభించింది. పలు అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం. భారత్-ఇటలీ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై నేటి చర్చల కోసం ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
అయితే, మోడీ-మెలోని భేటీ ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. వాణిజ్యం, రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, సాంకేతిక సహకారం వంటి పలు కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇటలీ ప్రధాని మెలోని ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన భారత్-ఇటలీ సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇద్దరు నాయకుల మధ్య సన్నిహిత సంబంధాలు పెరుగుతుండగా, ఈ పర్యటన ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. రోమ్‌లో మోడీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే బహుమతులు అందిస్తూ ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు. ప్రస్తుతం మోడీ ఇటలీ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU
— Narendra Modi (@narendramodi) May 20, 2026
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..