Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi – Meloni – Melody: ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ఓ ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడం.. ఆ సందర్భాన్ని వీడియో తీసిన మెలోని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. మెలోనికి మోడీ ప్రత్యేకమైన ‘మెలోడీ’ టాఫీని బహుమతిగా అందించారు. ఈ ఆసక్తికరమైన గిఫ్ట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతిపై స్పందించిన జార్జియా మెలోని, తన సోషల్ మీడియా ఖాతాలో “బహుమతికి ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేశారు. దీంతో #Melodi హ్యాష్‌ట్యాగ్ మరోసారి నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.
గత కొన్ని సంవత్సరాలుగా మోడీ-మెలోని స్నేహబంధం సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇద్దరు నేతలు కలిసిన ప్రతిసారి #Melodi అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతుండగా, ఈసారి మోడీ ‘మెలోడీ’ టాఫీల ప్యాకెట్‌ను బహుమతిగా ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటలీ-భారత్ సంబంధాల్లో పెరుగుతున్న ఆత్మీయతకు ప్రతీకగా ఈ బహుమతిని విశ్లేషకులు చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా “Melodi” అనే పదాన్ని సరదాగా “Melody” చాక్లెట్‌తో ముడిపెట్టి నెటిజన్లు భారీగా పోస్టులు చేస్తున్నారు.
Also Read
- China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇటలీలో ఉన్నారు. ఈ సందర్భంగా వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం, సాంకేతిక సహకారం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే మోడీ-మెలోని సెల్ఫీలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా, తాజా ‘మెలోడీ టాఫీ’ బహుమతి ఘటన సోషల్ మీడియాలో కొత్త హాట్ టాపిక్‌గా మారింది.
Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!