DMK Supports Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. కేంద్రం హామీతో స్టాలిన్ తీర్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK Supports Delimitation Bill: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లు విషయంలో విపక్షాలు విడిపోతున్నాయా? అంటే అవునని సమాధానం వస్తుంది.. గతంలో ముక్తకంఠంతో ‘ఇండియా కూటమి’లోని అన్ని పార్టీలు వ్యతిరేకించాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దేశ రాజకీయాల్లో డీలిమిటేషన్ బిల్లుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించింది. ఈ రోజు ఉదయం పార్టీ ఎంపీలతో సమావేశమైన డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి ఊరటనివ్వడంతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియకు మార్గం సుగమం చేయనుంది.
కేంద్రం అంగీకరించిన డీఎంకే ప్రధాన డిమాండ్
డీలిమిటేషన్ ప్రక్రియలో అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలన్నది డీఎంకే ప్రధాన డిమాండ్. ముఖ్యంగా తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గకూడదని ఆ పార్టీ స్పష్టం చేస్తూ వచ్చింది. జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమైంది. తాజాగా ప్రతి రాష్ట్రంలోనూ ఎంపీ స్థానాలను 50 శాతం పెంచాలన్న కేంద్రం ప్రతిపాదన తమ అభ్యంతరాలను పరిష్కరించిందని డీఎంకే నేతలు తెలిపారు.
Also Read
- Karthigai Deepam Row: కార్తీక దీపం వివాదం.. సికందర్ బాదుషా దర్గాకు పోటెత్తిన భక్తులు.. కేరళం నుంచి కూడా రాక!
- Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే ఓకే.. స్టాలిన్ సంచలన నిర్ణయం..?
- Major Terror Plot Foiled in J&K: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. ముగ్గురు లష్కరే అనుచరుల అరెస్ట్..!
- Delimitation Bill: మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. మూడింట రెండొంతుల మెజారిటీపై ధీమా..!
ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల పెంపు
పార్టీ ఎంపీల సమావేశం అనంతరం డీఎంకే ఎంపీ దయానిధి మారన్ కేంద్రం ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ పార్లమెంట్ స్థానాలను 50 శాతం పెంచాలన్న నిర్ణయం తమ డిమాండ్‌కు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. దీనివల్ల మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం కూడా ఏర్పడుతుందని తెలిపారు. తమ డిమాండ్ నెరవేరినందున బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని వెల్లడించారు.
తమిళనాడుకు 7.18 శాతం వాటా కొనసాగాలి
డీఎంకే నిర్ణయంపై ఎంపీ ఏ. రాజా మరింత స్పష్టత ఇచ్చారు. తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం పార్లమెంటరీ ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకూడదనే హామీ ఆధారంగానే బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విషయంలో 59 స్థానాల సంఖ్యపై అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించారు. అవసరమైతే మరిన్ని సవరణలు ప్రతిపాదించే పూర్తి అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు తమకు ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ కూటమిలో భాగంగా ఉన్న సమయంలో కూడా ఇదే డిమాండ్‌ను ముందుకు తీసుకొచ్చిందని ఏ. రాజా గుర్తుచేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ న్యాయబద్ధంగా జరగాలని, తమిళనాడు ప్రయోజనాలు కాపాడాలని డీఎంకే మొదటి నుంచి కోరుతోందని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కీలక పరిణామం
డీలిమిటేషన్ అంశం కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు ప్రతిపక్ష పార్టీలకు మధ్య వివాదానికి కారణమైంది. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభలో వాటి ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ప్రయోజనాలకు భరోసా లభించడంతో డీఎంకే తన వైఖరిలో కీలక నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
DMK Supports Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. కేంద్రం హామీతో స్టాలిన్ తీర్మానం..
-
OTR: వైసీపీకి దూరంగా తమ్మినేని సీతారాం?.. కీలక సమయంలో ఎందుకు సైలెంట్?
-
Hyderabad: ఓయోలో గుంటూరు యువకుడు అనుమానాస్పద మృతి..
-
Gold Sale Income Tax: తల్లిదండ్రుల బంగారం అమ్మి ఇల్లు కొన్న వ్యక్తికి రూ.60 లక్షల ట్యాక్స్ షాక్.. అసలు ఏం జరిగిందంటే?
-
Bengali Aloo Posto Recipe: ఆలూ కూర తిని విసుగొచ్చిందా? బెంగాలీ స్టైల్లో ఆలూ పోస్తో ట్రై చేయండి.. రుచి అదిరిపోతుంది!
ట్రెండింగ్
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
-
Rishabh Pant: WTC చరిత్రలో ‘రిషబ్ పంత్’ సరికొత్త చరిత్ర..!
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!