ఇటలీ ఎయిర్ హోస్టెస్ అర్ధనగ్న ప్రదర్శనలతో కూడిన నిరసనలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇటలీలోని అలిటాలియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుమారు 50 మంది ఎయిర్‌హోస్టెస్‌లు అర్ధనగ్న నిరసనలకు దిగారు. రోమ్‌లోని టౌన్ హాలు ముందు తమ నిరసనలు వ్యక్తం చేశారు. జీతంలో కోతలు, ఉద్యోగాలు తొలగించడం పై మనస్తాపం చెంది నిరసనలకు దిగినట్టు చెప్పారు. ఈ మధ్య కాలంలో అలిటాలియా ఎయిర్‌లైన్స్‌ను తాజాగా ఐటీఏ ఎయిర్‌వేస్ స్వాధీనం చేసుకుంది.
ఈ పరిణామం అలిటాలియా ఎయిర్‌హోస్టేస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.
అలిటాలియా ఎయిర్‌లైన్స్ సుమారుగా 15,000 మంది ఉద్యోగులను నియమించుకుంది. కానీ ఐటీఏ ఎయిర్‌వేస్‌లో కేవలం2600 మంది మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారు. ఈ ఉద్యోగాలకు కూడా ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి ఉందని,తాము సందిగ్ధంలో ఉన్నామని, శాలరీలు తగ్గించారని ఓ సీనియర్ ఉద్యోగి తెలిపారు. చాలా మంది ఉద్యోగులను పక్కకు పెట్టడంతో ఏటీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.