Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol Diesel Price Hike: గత కొన్ని నెలలుగా ప్రపంచ ఇంధన సంక్షోభానికి మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్రమై ఉద్రిక్తతలు ప్రధాన కారణం అయ్యాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం మళ్లీ మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ మంటలకు పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలను పెంచింది. డాన్ పత్రికలోని ఒక నివేదిక ప్రకారం.. భారత పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరను రూ.13.18 పాకిస్థానీ రూపాయలు, హై-స్పీడ్ డీజిల్ ధరను రూ.13.80 పాకిస్థానీ రూపాయలు పెంచినట్లు వెల్లడించారు. ముడి చమురు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజా పెరుగుదల తరువాత, పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.310.71 కి చేరింది. హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ.323.30 కి చేరింది. పెట్రోలియం విభాగం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ కొత్త ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. దీనివల్ల పాకిస్థానీయులందరూ ఇప్పుడు తమ ఆదాయంలో గణనీయమైన నష్టాన్ని ఎదుర్కుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి గతంలో కూడా పాకిస్థాన్ పెట్రోల్ – డీజిల్ ధరలను గణనీయంగా పెంచింది. ఫిబ్రవరి 28న డీజిల్ ధర లీటరుకు రూ.281కి చేరగా, ఏప్రిల్ 3న అది లీటరుకు రూ.530.35కి చేరింది. మార్చి మొదటి వారంలో లీటరుకు రూ.266గా ఉన్న పెట్రోల్ ధర, ఏప్రిల్ 3న లీటరుకు రూ.458.41కి పెంచింది. తర్వాత కాలంలో ఈ ధరలు కాస్త తగ్గిన ఇప్పుడు మళ్లీ పెరిగాయి.
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు..
మధ్యప్రాచ్యంలో యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు సార్లు పెరిగాయి. మే 2026 నుంచి జరిగిన నాలుగు వేర్వేరు సందర్భాల్లో పెట్రోల్ ధర లీటరుకు మొత్తం రూ.7.8, డీజిల్ ధర రూ.8.7 పెరిగాయి. ఈ పెరుగుదలలతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12కి, డీజిల్ ధర లీటరుకు రూ.95.20కి చేరింది. ఇదే సమయంలో అంతర్జాతీయ పెట్రోల్ – డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే.. మిడిల్ ఈస్ట్ యుద్ద మేఘాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇటీవల యుద్ధం కారణంగా బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు $126 కు చేరుకుంది, కానీ ఇరాన్ – అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన తర్వాత, అది బ్యారెల్‌కు $72 కంటే తక్కువకు పడిపోయింది.
తాజావార్తలు
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!