US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Conflict: అమెరికా, ఇరాన్‌ల మధ్య కొన్నాళ్లుగా నడుస్తున్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ చేసిన రాయబారం మరోసారి విఫలమైంది. ఈ వారంలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాల్లో ఎలాంటి పురోగతి లభించలేదు. రెండు దేశాలూ తమ పట్టు వదలకుండా భీష్మించుకూర్చోవడంతో ఒప్పందం కుదరలేదని ఈ భేటీలకు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల ఈ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు అలముకునే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో మిడ్-టర్మ్ ఎన్నికలు ముగిసిన వెంటనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పెద్ద ఎత్తున సైనిక చర్యలకు ఆదేశించవచ్చని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు. మధ్యవర్తిత్వం విఫలమైనప్పటికీ ఖతార్ తన ప్రయత్నాలు పూర్తిగా ఆపలేదు గానీ, ఇరు దేశాల మొండి వైఖరి చూసి ఖతార్ రాయబారులు కూడా తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఈ చర్చల ప్రక్రియలో భాగంగా సోమవారం ఖతార్ ప్రధాన రాయబారి అలీ అల్-థవాదీ న్యూయార్క్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఆయన బృందంతో గంటల తరబడి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఇరాన్ ఎదుర్కొంటున్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా తొలగించాలన్న ఇరాన్ డిమాండ్, అలాగే ఇరాన్ తన అణు కార్యక్రమాలను పరిమితం చేసుకోవాలన్న అమెరికా కండీషన్లను బ్యాలెన్స్ చేస్తూ ఖతార్ ఒక రెండు పేజీల ఒప్పంద ప్రతిపాదనను సిద్ధం చేసింది. దానిపైనే ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత సోమవారం సాయంత్రానికి అల్-థవాదీ వాషింగ్టన్ చేరుకుని ట్రంప్ అల్లుడు, రాయబారి జారెడ్ కుష్నర్ తో పాటు ఇతర కీలక అమెరికా అధికారులతో చర్చలు జరిపారు. ఈ కీలక సమావేశంలో కొద్దిసేపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాల్గొన్నారు. అయితే దీనిపై స్పందించేందుకు వైట్ హౌస్ నిరాకరించింది.
Also Read
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
నిజానికి సోమవారం ఉదయం వరకు వైట్ హౌస్ ఈ చర్చలపై చాలా పాజిటివ్‌గా ఉంది. ఇరాన్ అణు అంశాలపై కొంత వెనక్కి తగ్గే సంకేతాలు ఇచ్చిందని, చర్చలు చాలా ఆశాజనకంగా సాగుతున్నాయని అమెరికా అధికారులు ఎక్సియోస్ లాంటి ప్రముఖ మీడియా సంస్థలకు చెప్పారు. ఇరాన్ గనుక అణు రంగాన్ని అదుపులో ఉంచుకునేందుకు స్పష్టమైన అడుగులు వేస్తే, ఆ దేశంపై ఉన్న ఆంక్షలను సడలించి, నిలిపివేసిన నిధులను విడుదల చేయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, అంతలోనే సీన్ మారిపోయింది. ఖతార్ ప్రతినిధులు వైట్ హౌస్‌లోనే ఉన్న సమయంలో, ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ పెట్టారు. తాము ఇరాన్‌కు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేయడంతో ఒక్కసారిగా చర్చల సరళి మొత్తం తలకిందులైంది.
దీంతో ఈ చర్చల్లో ఎలాంటి ముందడుగు పడలేదని, వ్యవహారం మొత్తం మళ్లీ మొదటికొచ్చిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇటు అమెరికా ఏమాత్రం అంగీకరించలేని డిమాండ్లను ఇరాన్ పెడుతుంటే, అటు అమెరికా మాత్రం ఈ పోరులో తమదే పైచేయి అని, తాము తగ్గి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదనే ధీమాతో ఉంది. మధ్యలో పాకిస్తాన్, ఈజిప్ట్ వంటి ప్రాంతీయ దేశాలు కూడా ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చి అణు విషయంలో కొంత రాయితీలు ఇవ్వాలని కోరినప్పటికీ, గత ఏడాది జూన్ నాటి మూల ఒప్పందానికి (MoU) అమెరికా కట్టుబడి ఉంటేనే తాము ఆలోచిస్తామని ఇరాన్ తేల్చిచెప్పేసింది. ఇక, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సిన్ రజాయీ మంగళవారం అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. తాము తమ షరతులను స్పష్టంగా అమెరికాకు తెలియజేశామని, కానీ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ట్రంప్ ప్రస్తుతం ఒక పెద్ద ఊబిలో చిక్కుకున్నారని, ఆయన సరిగ్గా చర్చలు జరపలేక, అలాగని యుద్ధం కూడా చేయలేక సతమతమవుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ట్రంప్ కూడా మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉందని, వారు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా లొంగిపోతారని హెచ్చరించారు. ఇదంతా ఇరాన్ వద్ద అణు ఆయుధం లేకుండా చేయడానికేనని, వాళ్లను ఎప్పటికీ అణు ఆయుధం పొందనివ్వమని తెగేసి చెప్పారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో దౌత్యపరమైన పరిష్కారం దొరకడం చాలా కష్టమని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!