Pizza: అమెరికాలో ఫిజ్జా అమ్మకాలు, ప్రపంచంలో జరిగే యుద్ధాలకు ఏం సంబంధం. అమెరికా మిలిటరీ హెడ్ క్వార్టర్ అయిన పెంటగాన్ పరిసర ప్రాంతాలో పిజ్జా అమ్మకాలు పెరిగే, ప్రపంచంలోని ఏ దేశానికో మూడినట్లే. గతంలో కూడా అమెరికా పనామాపై దాడి చేసినప్పుడు, గ్రెనెడాపై దాడికి దిగినప్పుడు పెంటగాన్ సమీపంలోని పిజ్జా సెంటర్లకు విపరీతంగా ఆర్డర్లు పెరిగాయి. అర్థరాత్రి కూడా పిజ్జా ఆర్డర్లు వెల్లువలా వచ్చాయి. ఇరాన్ కువైట్‌పై దాడి చేశాయి, సద్దాం హుస్సేన్ సేనలు గల్ఫ్ దేశాన్ని గంటల్లోనే ఆక్రమించింది, కువైట్‌ని ఇరాన్లో 19వ ప్రావిన్సుగా ప్రకటించారు. ఆ సమయంలో కూడా పిజ్జా ఆర్డర్లు పెరిగాయి.
Read Also: Haryana: నెల రోజుల శిశువు కడుపులో కవల పిండాలు.. చివరికీ….
అసలేంటీ ఈ పిజ్జా ఇండెక్స్:
దీనినే ‘‘పెంటగాన్ పిజ్జా ఇండెక్స్’’గా పిలుస్తారు. ఇది పెరిగితే, ప్రపంచంలో ఎక్కడో చోట యుద్ధం, ఘర్షణ తప్పకుండా జరుగుతుందనే వాదన ఉంది. యూఎస్ సైనిక చర్యలు, ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా ఈ పిజ్జా డెలివరీల్లో పెరుగుదల కనిపిస్తుంది. నిజానికి ఇలాంటి సమయంలో పెంటగాన్‌లో రక్షణ అధికారులు, ఇంటెజెన్స్ అధికారులు, గూఢచారుల ఉనికి పెరుగుతుంది. చాలా సేపు ఆఫీసుల్లో పనిచేయాల్సి వస్తుంది. ఆ సమయంలో అధికారులు సులువుగా దొరికే పిజ్జాను ఆర్డర్ చేసుకుంటారు. దీంతో పిజ్జా డెలివరీల సంఖ్య ఆ ప్రాంతంలో పెరుగుతుంది.
అయితే, ఈ వారం ప్రారంభంలో కూడా పెంటగాన్, యూఎస్ ప్రభుత్వ స్థలాల చుట్టూ పిజ్జా డెలివరీలు గణనీయంగా పెరిగాయి. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఊహాగానాలు వెలువడ్డాయి. పెంటగాన్ పిజ్జా ఇండెక్స్ ఏకంగా 800 శాతం పెరిగింది. శుక్రవారం తెల్లవారుజామున పెంటగాన్ సమీపంలోని డొమినోస్ పిజ్జాకు లైవ్ ఫుట్ ట్రాక్ ట్రాఫిక్ డేటా 357 శాతం పెరిగింది.
అయితే, ఈ పిజ్జా ఇండెక్స్ అనేది రష్యా సోవియట్ యూనియన్‌గా ఉన్న సమయంలో పుట్టింది. ఆ సమయంలో అమెరికా, రష్యా మధ్య కోల్డ్ వార్ జరిగేది. వాషింగ్టన్లో అమెరికా సైనిక సన్నద్ధతను తెలుసుకునేందుకు సోవియట్ గూఢచారులు పిజ్జా డెలివరీలపై నిఘా పెట్టారు. ‘‘పిజింట్’’(పిజ్జా ఇంటెలిజెన్స్‌కు సంక్షిప్త రూపం) పిలువబడే ఈ నిఘా ద్వారా, పెంటగాన్, సీఐఏ ప్రధాన కార్యాలయాల వద్ద అర్థరాత్రి పిజ్జా ఆర్డర్లను ట్రాక్ చేశారు. ఏదైనా ప్లాన్, సంక్షోభం వచ్చే సమయంలో అధికారులు రాత్రంతా పనుల్లో నిమగ్నమయ్యారని ఇది సూచిస్తుంది.
Read Also: Prajwal Revanna: దిగజారిన పనితో.. ఎంపీ నుంచి జైలులో క్లర్క్‌గా ప్రజ్వల్ రేవణ్ణ
పిజ్జా ఆర్డర్లు పెరిగితే ఎవరికో మూడినట్లే:
1989లో అమెరికా పనామాపై దండయాత్ర చేసింది. ఆ సమయంలో ఇలాగే పిజ్జా ఆర్డర్లు పెరిగాయి. గల్ఫ్ యుద్ధానికి కారణమైన ఇరాన్ కువైట్ దాడికి కొన్ని గంటల ముందు ఆగస్టు 1, 1990లో సీఐఏ కార్యాలయానికి రికార్డు స్థాయిలో 21 పిజ్జాలు డెలివరీ అయ్యాయి. 1983లో గ్రెనెడా ఆపరేషన్‌లో కూడా ఇదే పరిస్థితి. 1991లో అమెరికా ‘‘ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్’’ పేరుతో కువైట్‌ని ఇరాక్ నుంచి విడిపించడానికి దాడి ప్రారంభించింది. ఆ సమయంలో పెంటగాన్‌కు మూడు డెలవరీల నుంచి 101 డెలివరీలు పెరిగాయి. ఇదే విధంగా 1998లో ఇరాన్‌పై యూఎస్, యూకే సంకీర్ణ సేనల దాడుల సమయంలో కూడా పిజ్జాల అమ్మకాలు 250 శాతం పెరిగాయి. 1999లో కొసావో యుద్ధం సెర్బియాపై నాటో బాంబు దాడి సమయంలో కూడా ఇలాగే జరిగింది.
9/11 దాడుల తర్వాత, 2001 ఆప్ఘనిస్తాన్ దండయాత్ర, 2003 ఇరాక్ యుద్ధం సమయంలో కూడా పిజ్జాల డెలివరీల శాతం ఒక్కసారిగా పెరిగింది. 2024లో ఇరాన్ ఇజ్రాయిల్‌పై డ్రోన్ దాడి చేసిన కొన్ని గంటల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు తాజా ఉదాహరణ. ఈ వారం ప్రారంభంలో ‘‘ట్రంప్ ఈస్ డెడ్’’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ సమయంలో, పెంటగాన్ పిజ్జా ఇండెక్స్ గతంలో ఎప్పుడూ లేని విధంగా 800 శాతం పెరిగింది.