Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌లో నాయకత్వ సంక్షోభం మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 25 మందికి పైగా సీనియర్ సైనిక అధికారులు పదవులు కోల్పోయారని, మరో 45 మంది అధికారుల ప్రమోషన్లు నిలిచిపోయాయని తాజాగా పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌తో యుద్ధం ఆరు నెలలకు చేరుకున్న సమయంలోనే అమెరికా సైన్యంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కాల్ రాజీనామా చేయడం అమెరికా సైన్యంలో కలకలం రేపింది. ఆయన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు సన్నిహితుడు, యేల్ లా స్కూల్లో ఆయన బ్యాచ్‌మేట్‌గా ఉన్నారు. ఒక దశలో హెగ్సెత్కు వారసుడిగా కూడా డ్రిస్కాల్ పేరు వినిపించింది. అయితే సైనిక నాయకత్వం, సైన్యం ఆధునీకరణ అంశాలపై డ్రిస్కాల్‌కు హెగ్సెత్తో చాలాకాలంగా విభేదాలు ఉన్నట్లు సమాచారం.
అంతేకాకుండా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌కు సంబంధించిన సున్నితమైన దౌత్య వ్యవహారాల బాధ్యతలను కూడా డ్రిస్కాల్‌కు అప్పగించారు. ఆయన రాజీనామాతో అమెరికా ఆర్మీలో నాయకత్వ సమస్య మరింత తీవ్రమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందే ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను కూడా హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. దీంతో ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో అమెరికా ఆర్మీకి సెనేట్ ఆమోదించిన శాశ్వత పౌర, సైనిక నాయకత్వం లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడిందని నివేదికలు చెబుతున్నాయి. హెగ్సెత్ అమెరికా రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు ప్రతి మిలిటరీ సర్వీస్‌కు చెందిన అత్యున్నత స్థాయి అధికారుల్లో మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. కొందరిని పదవుల నుంచి తొలగించగా, మరికొందరు వారివారే తమ పదవులకు రాజీనామా చేశారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, నేవీకి చెందిన అత్యున్నత అధికారి, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వంటి కీలక పదవుల్లోనూ మార్పులు జరిగాయి. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు హెగ్సెత్ పదవీకాలంలో రెండు డజన్లకు పైగా సీనియర్ అధికారులను తొలగించారు. ప్రస్తుతం జాయింట్ చీఫ్స్‌లో మెరైన్ కార్ప్స్, స్పేస్ ఫోర్స్ అధిపతులు మాత్రమే హెగ్సెత్ బాధ్యతలు చేపట్టిన సమయంలో ఉన్న అధికారులుగా మిగిలినట్లు తెలుస్తోంది.
Also Read
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
45 మంది అధికారుల ప్రమోషన్లపై నిలుపుదల
న్యూయార్క్ టైమ్స్ తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది హెగ్సెత్ కనీసం 45 మంది అధికారుల ప్రమోషన్లను నిలిపివేసినట్లు వెల్లడించింది. సాధారణంగా సీనియర్ సైనిక అధికారుల ప్రమోషన్ ప్రక్రియ రాజకీయ జోక్యానికి దూరంగా ఉంటుందని చెబుతారు. అయితే ప్రస్తుతం ఈ ప్రమోషన్ల వ్యవహారం అమెరికా రక్షణ శాఖలో చర్చకు దారితీసిందని అంటున్నారు. ఎన్బీసీ న్యూస్ ప్రకారం.. ఇటీవలి వారాల్లో డజనుకు పైగా నల్లజాతీయులు, హిస్పానిక్ వర్గాలకు చెందిన అధికారులు, మహిళా అధికారుల ప్రమోషన్లు కూడా నిలిపివేసినట్లు సమాచారం. ఈ పరిణామాలపై అమెరికా రక్షణ వ్యవస్థలో జోరుగా చర్చ జరుగుతోంది. ఒక పక్క పెంటగాన్‌లో నాయకత్వ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఇరాన్‌తో యుద్ధం అమెరికా సైనిక సామర్థ్యానికి పెద్ద సవాలుగా మారిందని విశేషకులు అభిప్రాయపడుతున్నారు. యూరప్, పసిఫిక్, లాటిన్ అమెరికా ప్రాంతాల్లోని అమెరికా సైనిక కమాండర్లు ఇరాన్ యుద్ధం కోసం భారీగా బలగాలను తరలించడంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
సైనికులను ఎక్కువ కాలం ఒకే ప్రాంతంలో మోహరించడం వల్ల ఇతర ప్రాంతాల్లో తలెత్తే భద్రతా ముప్పులను ఎదుర్కొనే అమెరికా సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని కమాండర్లు అభిప్రాయపడినట్లు సమాచారం. వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం అమెరికా నేవీలోని డిస్ట్రాయర్లలో కేవలం 25 శాతం వరకు మాత్రమే ప్రస్తుతం మోహరింపునకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వద్ద ఉన్న ఏకైక ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను కూడా మధ్యప్రాచ్యానికి తరలించినట్లు సమాచారం. యుద్ధ ప్రభావం అమెరికా ఆయుధ నిల్వలపైనా కూడా పడినట్లు వార్తలు వస్తున్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం.. అమెరికా వద్ద ఉన్న పేట్రియాట్ ఇంటర్సెప్టర్లలో 65 శాతం వరకు ఇప్పటికే ఉపయోగించినట్లు పేర్కొంది. దీంతో నాటో మిత్రదేశాలకు ఆయుధాలను అందించడంతో పాటు, ఒక వేళ చైనాతో భవిష్యత్‌లో సంభవించే పరిస్థితి తలెత్తితే ఆ యుద్ధానికి సిద్ధమయ్యే విషయంలోనూ అమెరికాపై ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషణలు చెబుతున్నాయి.
ఆరోపణలను ఖండించిన పెంటగాన్
అయితే పెంటగాన్‌లో అవ్యవస్థ నెలకొన్నట్లు వస్తున్న వార్తలను రక్షణ శాఖ ప్రతినిధి సీన్ పార్నెల్ ఖండించారు. జనరల్స్ మధ్య అభిప్రాయ భేదాలు సాధారణ ప్రక్రియలో భాగమేనని ఆయన పేర్కొన్నారు. సైనిక వ్యవహారాలకు సంబంధించిన రహస్య అంచనాలను బహిర్గతం చేయడం నేరమని, అది సైన్యానికి నమ్మకద్రోహం వంటిదని వ్యాఖ్యానించారు. అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోయాయన్న వార్తలను కూడా పెంటగాన్ తప్పుబట్టింది. దేశంలో తగినంత ఆయుధ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. మరోవైపు పెంటగాన్ పారదర్శకతపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మే 5 తర్వాత రక్షణ శాఖలో అధికారిక ప్రెస్ బ్రీఫింగ్ నిర్వహించలేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో యుద్ధ పరిస్థితుల మధ్య దాదాపు నాలుగు నెలలుగా సాధారణ ప్రెస్ బ్రీఫింగ్‌లు జరగలేదని చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అధ్యక్షుడు ట్రంప్ మాత్రం పీట్ హెగ్సెత్కు తన మద్దతును కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 1.5 ట్రిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌ను ఆమోదించాలని ఆయన కోరుతున్నారు. దీంతో పెంటగాన్‌లో వివాదాలు కొనసాగుతున్నప్పటికీ హెగ్సెత్‌పై ట్రంప్ మద్దతు తగ్గకపోగా.. రక్షణ శాఖపై ఆయన పట్టు మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
-
Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
-
iQOO 16: ఐకూ 16 అదిరిపోయే గేమింగ్ ఫోన్.. 8,500mAh బ్యాటరీ, 16GB RAM, 50MP ట్రిపుల్ కెమెరా!
-
The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
-
Sugar Price: సామాన్యులకు గుడ్‌న్యూస్! కేంద్రం సంచలన నిర్ణయం.. చక్కెర ధరలు దిగి వస్తాయా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!