Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
- టాటా కెమికల్స్‌కు కెన్యా అధ్యక్షుడు రూటో షాక్..
- స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపణ..
- వనరుల్ని వేరే వారికి కట్టబెట్టే ప్రయత్నమని రూటోపై ప్రతిపక్షం ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో షాక్ ఇచ్చారు. కెన్యాలోని లేక్ మగాడి ప్రాంతంలో టాటా కెమికల్స్ కార్యకలాపాలు నిలిపేయాలని ఆదేశించారు. ఇక్కడి వనరుల్ని ఉపయోగించుకుంటున్నప్పటికీ, స్థానికులకు సరైన ఉపాధి, ఉద్యోగ, పారిశ్రామికాభివృద్ధి కల్పించడం లేదని రూటో ఆరోపించారు. టాటాకు సుమారు 100 ఏళ్ల కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ, కాజియాడోలో పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ‘‘మనం ఇతరులకు బానిసలమా.?’’ అంటూ ప్రశ్నించారు. లేక్ మగాడి నుంచి వనరుల్ని ఇతర దేశాలకు తరలించడం కాకుండా, వాటిని కెన్యాలో ప్రాసెస్ చేసి స్థానికంగా ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలకు ఉపయోగించాలని రూటో స్పష్టం చేశారు.
ఇదే సమయంలో టాటా కెమికల్స్ స్థానంలో కొత్త పరిశ్రమల్ని తీసుకురావాలని కెన్యా ప్రభుత్వం భావిస్తోంది. కొత్త కంపెనీ కాజియాడోలోనే తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రూటో తెలిపారు. ఒక సంస్థ గ్లాస్ తయారీ పరిశ్రమను, మరో సంస్థ కెమికల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.లేక్ మగాడిలో టాటా కెమికల్స్ కార్యకలాపాలు 1911లో ‘మగాడి సోడా కంపెనీ’గా ప్రారంభమైంది. 2005లో టాటా కెమికల్స్ ఈ సంస్థను సొంతం చేసుకుంది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
లేక్ మగాడిలోని ట్రోనా ఖనిజాన్ని వెలికితీసి సహజ సోడా యాష్‌ను ఉత్పత్తి చేస్తోంది. గాజు, డిటర్జెంట్లు, కెమికల్స్ తయారీతో పాటు నీటి శుద్ధిలోనూ సోడా యాష్‌ను ఉపయోగిస్తారు. ఈ కార్యకలాపాలు కెన్యా నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులకు కూడా దోహదపడుతున్నాయి. కెన్యా ప్రభుత్వం జూలై 28 నుంచి సంస్థ మైనింగ్ కార్యకలాపాలను సస్పెండ్ చేసింది. టాటా కెమికల్స్ మాత్రం తాము ప్రభుత్వం కోరిన సమాచారాన్ని, పత్రాలను అందించామని, నిబంధనలకు అనుగుణంగా ఉన్నామన్నారు.
రూటో నిర్ణయంపై కెన్యా ప్రతిపక్ష పార్టీ ‘‘డెమోక్రసీ ఫర్ ది సిటిజన్ పార్టీ(డీసీపీ)’’ తీవ్రంగా వ్యతిరేకించింది. టాటా కెమికల్స్ మూసివేత వల్ల మగాడి ప్రాంతంలో ప్రత్యక్షంగా,పరోక్షంగా వేలాది మంది ఉపాధిపై ప్రభావం పడుతుందని చెప్పింది. మగాది ప్రాంతంలో భారీ లిథియం నిల్వలు, చమురు అన్వేషన అవకాశాలు ఉన్నాయని డీసీపీ చెప్పింది. టాటా కెమికల్స్‌ను అక్కడి నుంచి పంపించి, ఆ వనరుల్ని వేరే వారికి అప్పగించాలని ప్రయత్నిస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది.
తాజావార్తలు
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!